మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు నేడు (10 అక్టోబర్) హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానెల్ మంచు విష్ణు ప్యానెల్ హోరాహోరీపైనే చర్చ సాగుతోంది. ఎవరిది గెలుపు ? అన్నది ఆసక్తిగా మారింది. సాయంత్రానికి కొత్త అధ్యక్షుడు కార్యవర్గానికి సంబంధించిన రిజల్ట్ రానుంది.
అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టిస్టుల మధ్య డర్టీగేమ్ సర్వత్రా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా సీనియర్ ఆర్టిస్టులు ఒళ్లు మరిచి ఒకరితో ఒకరు ఘర్షించుకోవడం హీటెక్కించింది. ఇక ఈ ఎపిసోడ్ లో ఓ ఇద్దరు సీనియర్ల నడుమ వార్ ఆఫ్ వర్డ్స్ లో ఉపయోగించిన పదజాలం చర్చకు వచ్చింది. ``వయసు మీదపడిన ఎప్పుడు వుంటారో? ఎప్పుడో పోతారో?`` అంటూ ఒక సీనియర్ పై ఇంకో సీనియర్ నటుడు కామెంట్ చేయడం చర్చకు వచ్చింది.
నిజానికి ఆయన అలా అనాల్సింది కాదు! అంటూ సోషల్ మీడియాల్లో డిబేట్లు రన్ అవుతున్నాయి. తనకంటే సీనియర్ ... పైగా జాతీయ ఉత్తమ నటుడిగా ఆయన పేరు మార్మోగింది. వయసు మీద పడిన వ్యక్తి కావడంతో అలాంటి కామెంట్లు చేయాల్సింది కాదు! అంటూ చర్చ సాగుతోంది. అయితే ఎన్నికల వేళ వేడిలో సదరు నటుడు నోరు జారి ఉంటారని కూడా ఒక సెక్షన్ విశ్లేషిస్తోంది. ఏదేమైనా ఆర్టిస్టుల మధ్య మరీ ఇలా డర్టీగా వివాదాలు నడవడం ఇటీవల చర్చగా మారుతోంది.