నిరుత్సాహంగా ఆలియా.. కార‌ణ‌మేంటో తెలుసా?

Update: 2021-04-13 14:30 GMT
ఇటీవ‌ల బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న ఆలియా అనూహ్యంగా కోవిడ్ భారిన ప‌డి చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. త‌న ఇంట్లో స్వీయ‌నిర్భంధంలో ఉన్న ఫోటోల్ని ఇటీవ‌ల షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి.

ప్రస్తుతానికి COVID 19 తో పోరాడుతున్న అలియా భట్ కాస్త ఆరోగ్యం కుదుట‌ప‌డ‌గానే త‌న పాత జ్ఞాప‌కాల్లోకి వెళ్లింది. అలాగే త్రోబ్యాక్ ఫోటోల్ని షేర్ చేస్తూ నాటి సంగ‌తుల్ని రివైండ్ చేసుకుంటోంది. ఇంత‌కుముందే ప్రియుడితో క‌లిసి మా‌ల్దీవుల సెలవులకు వెళ్లిన ఆలియా అక్క‌డి తన అరుదైన‌ క్షణాలను కోల్పోతున్న భావ‌న‌ను వ్య‌క్త‌ప‌రిచింది. COVID నుండి కోలుకుంటున్న అలియా బీచ్ డేస్ ని త‌ల‌చి కలలు కంటోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఆమె షేర్ చేసిన‌ ఫోటోనే అందుకు సాక్ష్యంగా నిలుస్తోంఇ.

సోషల్ మీడియాలో ల‌క్ష‌లాది మందిని మ‌రోసారి ఈ ఫోటో ఆకర్షిస్తోంది.  అలియా న‌టిస్తున్న బ్ర‌హ్మాస్త్ర‌- ఆర్.ఆర్.ఆర్- గంగూబాయి కతియావాడి రిలీజ్ ల‌కు రావాల్సి ఉంది. క‌రోనా క్రైసిస్ వ‌ల్ల ఇవ‌న్నీ అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిన‌దే.
Tags:    

Similar News