టాలీవుడ్ యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ అంతా కలిసి ప్రొడ్యూసర్స్ గిల్డ్ ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో వున్న వాళ్లంతా ప్రస్తుతం వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా నిర్మిస్తున్న సినిమాలు ఆలస్యం కావడంతో చాలా వరకు నిర్మాతలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. అంతే కాకుండా కోవిడ్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్ ల వల్ల భారీ స్థాయిలో రుణాలకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితులు తలెత్తాయి. వాటిని కూడా భిరించిన వీరికి ప్రస్తుతం పెరిగిన బడ్జెట్ లు, రెమ్యునరేషన్ లు ప్రధాన సమస్యగా మారాయట.
దీనిపై చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నా సీరియస్ మీటింగ్ మాత్రం నిర్మాతల మధ్య జరగలేదు. తాజాగా పరిస్థితులు మారడంతో ప్రేక్షకులు థియేటర్లకు రాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇది కూడా ప్రధానంగా నిర్మాతలకు తీవ్ర ఇబ్బందులని క్రియేట్ చేస్తోంది. ఇదిలా వుంటే తాజా సమస్యలపై తాజాగా వీరంతా ఇటీవల మాదాపూర్ సమీపంలో వున్న దసపల్లా హోటల్ లో ప్రత్యేకంగా సమావేశం అయ్యారని, సినిమా నిర్మాణ వ్యయం, పెరుగిన ఆర్టిస్ట్ ల రెమ్యునరేషన్ లు వంటి వివిధ ఆంశాలపై కీలకంగా భేటీ అయ్యారని తెలిసింది.
ఈ కీలక భేటీలో పలు అంశాలపై చర్చ జరిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఇద్దరు స్టార్ హీరోల రెమ్యునరేషన్ లపైనే ఎక్కువగా జర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ ఇద్దరు స్టార్ హీరోలు మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు.
వీరిద్దరు ఒక్క సినిమాకు ప్రస్తుతం 50 కోట్ల వరకు తీసుకుంటున్నారు. ఒక్క పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయకపోయినా ఈ రేంజ్ లో ఈ హీరోలు డిమాండ్ చేయడం ప్రొడ్యూసర్లకు నచ్చడం లేదట.
పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తే ఐదు భాషల్లో బిజినెస్ అవుతుంది కాబట్టి ఏదోలా ఇవ్వోచ్చు. కానీ ఓన్లీ తెలుగులో చేస్తున్న సినిమాకే ఈ రేంజ్ పారితోషికంని పవన్ కల్యాణ్ , మహేష్ బాబు డిమాండ్ చేస్తుండటంతో ప్రొడ్యూసర్స్ దీనికి సరైన పరిష్కారాన్ని వెతకాలని నిర్ణయానికి వచ్చారట. అంతే కాకుండా భారీ స్థాయిలో రెమ్యునరేషన్ లని హీరోలు డిమాండ్ చేయడం వల్లే నిర్మాణ వ్యయం కూడా భారీ స్థాయిలో పెరిగిపోయిందని, దీనిని ఎలాగైనా కట్టడి చేయాలనే నిర్ణయానికి వచ్చారట.
హీరోల కారణంగా బడ్జెట్ లు పెరుగుతున్నా ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు రావడం లేదని, దానికి ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా నిర్మాతలు చేసినట్టుగా చెబుతున్నారు. అంతే కాకుండా ఆగస్టు 1 నుంచి కొత్త సినిమా షూటింగ్ లని ఆపేయాలనే అంశంపై కూడా చర్చ జరిగినట్టుగా చెబుతున్నారు. ఈ నిర్ణయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎంత వరకు అమలు చేస్తుందో..స్టార్ హీరోలు ఈ నిర్ణయాలకు ఎంత వరకు కట్టుబడి వుంటారో వేచి చూడాల్సిందే అని ఇన్ సైడ్ టాక్.