జాబితాలో న‌య‌న్ స‌రే.. కీర్తి - సామ్ పేర్లేవి?

Update: 2018-09-22 08:45 GMT
ఆస్కార్ 2019 నామినేష‌న్స్ జాబితా అంటూ తాజాగా హ‌డావుడి మొద‌లైంది. ఇందులో హిందీ - గుజ‌రాతీతో పాటు త‌మిళ సినిమాల పేర్లు క‌నిపించాయి. సౌత్ నుంచి రెండు త‌మిళ చిత్రాలు కంటెస్టెంట్‌ గా క‌నిపించ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఈ జాబితాలో ఎక్క‌డా టాలీవుడ్ సినిమా జాడే క‌నిపించ‌లేదు. తాజాగా ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ మీడియా ఇచ్చిన లీకేజ్ ప్ర‌కారం.. తెలుగు సినిమా గురించిన ప్ర‌స్థావ‌నే లేదెక్క‌డా.

ఇక‌పోతే ప్రాంతీయ కేట‌గిరీలో పోటీప‌డేందుకు త‌మిళ సినిమా `కోల‌మావు కోకిల` రెడీ అవుతోంది. న‌య‌న‌తార న‌టించిన ఈ త‌మిళ చిత్రం నామినీల్లో ఉంద‌ని తాజాగా రివీలైంది. దీంతో పాటే `టులెట్‌` అనే వేరొక త‌మిళ సినిమా పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఇందులో మ‌న తెలుగు సినిమాలేవీ లేక‌పోయినా మ‌న‌కు తెలిసిన సినిమా - కోల‌మావు కోకిల‌. ఈ సినిమా తెలుగులో `కోకో కోకిల‌` పేరుతో రిలీజై చ‌క్క‌ని ప్ర‌శంస‌లు అందుకుంది. త‌లైవి న‌య‌న్ సినిమా త‌మిళ్‌ - తెలుగు రెండు చోట్లా హిట్టు అన్న టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకి తెలుగు క్రిటిక్స్ ప్ర‌శంస‌లు ద‌క్క‌డంతో జ‌నం థియేట‌ర్ల వైపు వెళ్లార‌ని చెప్పుకున్నారు. అంతేకాదు త‌లైవి న‌య‌న‌తార‌ న‌ట‌న‌కు గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఒక సామాన్య యువ‌తి డ్ర‌గ్స్ - మ‌త్తుప‌దార్థాల్ని నిర్ధేశించిన ల‌క్ష్యానికి చేర్చేందుకు ఏం చేసింది? అన్న క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమా పేరు ఆస్కార్ నామినీ కేట‌గిరీలో వినిపించ‌డం చ‌ర్చ‌కొచ్చింది.

ఇక‌పోతే సౌత్ నుంచి న‌య‌న్ సినిమాకి మాత్ర‌మే ఆ అర్హ‌త ఉందా?..  కీర్తి సురేష్ - స‌మంత న‌టించిన `మ‌హాన‌టి` ఎందుకు అర్హ‌త సాధించ‌లేదో విశ్లేషించాల్సి ఉంది. లెజెండ్ సావిత్రి పాత్ర‌లో అద్భుతంగా న‌టించింది కీర్తి. అదే సినిమాలో పాత‌కాలం జ‌ర్న‌లిస్టు మ‌ధుర‌వాణి పాత్ర‌లో స‌మంత అంతే గొప్ప‌గా న‌టించింది. అలానే రంగ‌స్థ‌లం చిత్రంలోనూ రామ‌ల‌క్ష్మి పాత్ర‌లో సామ్ న‌ట‌ ప్ర‌ద‌ర్శ‌న‌ త‌క్కువేం కాదు. అయితే న‌య‌న్ పేరు మాత్ర‌మే ఇప్పుడు హైలైట్ అవుతోంది. ఇటు కీర్తి పేరు కానీ - స‌మంత పేరు కానీ అస్సలు వినిపించ‌లేదు. ఒక‌వేళ ఆ ఇద్ద‌రూ అందుకు అర్హులు కార‌ని ఫిక్స‌వ్వాల్సిందేనా? అన్న చ‌ర్చా ఈ సంద‌ర్భంగా తెర‌పై కొచ్చింది.
Tags:    

Similar News