ఇది పవన్-త్రివిక్రమ్ లకు కౌంటరా?

Update: 2016-08-07 11:30 GMT
బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్.. తెలుగులో మంచి పేరున్న నిర్మాతల్లో ఒకడు. ఆయనతో పని చేసిన దర్శకులు.. హీరోలందరూ చాలా మంచిగా మాట్లాడతారు. ఆయన చుట్టూ ఎలాంటి వివాదాలూ లేవు. ఐతే ఎన్నడూ లేని విధంగా కొన్ని నెలల కిందట బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ గురించి ఓ నెగెటివ్ న్యూస్ బయటికి వచ్చింది. ‘అత్తారింటికి దారేది’ సినిమాకు సంబంధించి తమకు పారితోషకాలు పెండింగులో ఉన్నాయంటూ పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ ఇద్దరూ ఆయన మీద ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేయడం గుర్తుండే ఉంటుంది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమాకు సంబంధించి ప్రసాద్ రెమ్యూనరేషన్లు పెండింగులో పెట్టడమేంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వివాదాన్ని చర్చలతో పరిష్కరించుకోకుండా ఫిర్యాదుల వరకు వెళ్లడం మీదా విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో ప్రసాద్.. ఇప్పుడు తన బేనర్ లో ‘నాన్నకు ప్రేమతో’ సినిమా తీసిన సుకుమార్ కు లగ్జరీ కారు కొనివ్వడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘నాన్నకు ప్రేమతో’ మరీ భారీ లాభాలేమీ తెచ్చిపెట్టలేదు. అలాంటి సినిమా విషయంలోనే సంతృప్తి పడిపోయి కారు కొనిచ్చినవాడు.. ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి పారితోషకాలు పెండింగ్ పెడతాడా అని చర్చించుకుంటున్నారు జనాలు. అప్పటి వివాదానికి సంబంధించి పవన్.. త్రివిక్రమ్ లకు కౌంటర్ ఇవ్వడానికే ప్రసాద్ ఇలా చేశాడంటూ చర్చించుకుంటున్నారు జనాలు. మరోవైపు ఈ కారు డౌన్ పేమెంట్ వరకే ప్రసాద్ కట్టాడని.. నెలవారీ వాయిదాలు సుకుమారే కట్టుకుంటాడని మరో ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా సుకుమార్ కు ప్రసాద్ కారు కొనివ్వడం మాత్రం పెద్ద చర్చకే దారితీసింది టాలీవుడ్లో.
Tags:    

Similar News