మూడున్నరేళ్ల ప్రేమాయణానికి బ్రేక్ పడింది. ఇక ఆ జంట కేవలం ఫ్రెండ్స్ మాత్రమే. లవర్స్ ఎంతమాత్రం కాదు. ఆ సంగతిని అధికారికంగానే ఆ జంట ధృవీకరించిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇంతకీ ఎవరీ జంట? అంటే.. లోఫర్ బ్యూటీ దిశా పటానీ- టైగర్ ష్రాఫ్ జోడీ గురించే ఇదంతా. ఈ హాట్ లవ్ బర్డ్స్ మూడున్నరేళ్ల పాటు చెట్టాపట్టాల్ అంటూ షికార్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే దిశా పటానీతో టైగర్ ఎఫైర్ కి అతడి తల్లి గారు అడ్డు చెప్పారని వార్తలొచ్చాయి. అయినా ఈ జంట కలిసే షికార్లు చేశారు.
ఎట్టకేలకు రిలేషన్ షిప్ విషయంలో ఈ జంట పూర్తి క్లారిటీకి వచ్చేశారట. ఇక కలిసి ఉండలేం... కేవలం స్నేహితులుగా మాత్రమే కొనసాగాలని ఈ జంట ఓ నిర్ణయానికి వచ్చేశారట. ఆ మేరకు దిశా పటానీ.. టైగర్ ష్రాఫ్ కి అత్యంత సన్నిహితుల నుంచి లీకులు అందాయి. వాస్తవానికి ఈ ఇద్దరూ విడిపోతున్నారని చాలా కాలంగా రూమర్లు షికారు చేస్తున్నాయి. ఇద్దరి మధ్యా పొరపొచ్చాలొచ్చి చాలా కాలమే అయ్యింది. కానీ ఈ పరిస్థితిని ఎంతో పరిణతితో హ్యాండిల్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఇక ఎవరి దారి వారిదేనని సీరియస్ గానే నిర్ణయం తీసుకున్నారు.
అసలింతకీ విడిపోయేంతగా ఆ ఇద్దరి మధ్యా ఏం జరిగింది? అంటే చాలా కాలంగా ఒకరితో ఒకరికి సరిపడడం లేదు. అభిప్రాయ విభేధాలు తలెత్తుతూనే ఉన్నాయి. చిన్నపాటి గొడవలు తప్పలేదట. అయితే ప్రతిసారీ ఇద్దరూ ఎంతో పరిణతితో వ్యవహరించారు. ఆ క్రమంలోనే టైగర్ ష్రాఫ్ ఇతర ఎఫైర్ వార్తలు దిశాని తీవ్రంగా హర్ట్ చేశాయి. ఇక దిశా సైతం ఇటీవల యువ రాజకీయనాయకుడు ఆదిత్య థాక్రేకు చేరువవుతోందన్న వార్తలు వేడెక్కించాయి. ఆ క్రమంలోనే ఇద్దరూ విడిపోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఇకపోతే ఈ మొత్తం ప్రేమాయణంలో ట్విస్టేమిటంటే మేం ఇద్దరం ప్రేమలో ఉన్నాం! అని ఇదివరకూ ఎప్పుడూ ఈ జంట అంగీకరించకపోవడమే. మేం కేవలం స్నేహితులు మాత్రమేనంటూ కవరింగ్ ఇస్తూనే ఇంతకాలం ప్రేమాయణాన్ని సాగించారు. బ్రేకప్ అయ్యింది కదా? ఇకపై కలుసుకుంటారా..? అంటే అవన్నీ మామూలే. స్నేహితులుగా కలుస్తుంటారు. ప్రేమికులుగా కాదు! అని తెలుస్తోంది. ఇక కెరీర్ పరంగా చూస్తే టైగర్ ష్రాఫ్ .. దిశా ఇద్దరూ ఎవరికి వారు బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి ఆ ఇద్దరి సింగిల్ స్టాటస్ లో ఉన్నట్టేనన్నది కన్ఫామ్.