సిక్స్ ప్యాక్ కు పోటీగా సెక్సీ ప్యాక్

Update: 2018-04-27 05:17 GMT
బాలీవుడ్ లో రీసెంట్ సూపర్ హిట్ బాఘీ-2లో హీరో టైగర్ ష్రాఫ్ స్టంట్లు ఎంత ఆకట్టుకున్నాయో హీరోయిన్ దిశా పఠానీ గ్లామర్ అంతకుమించి ఆకట్టుకుంది. వీలు చిక్కినప్పుడల్లా జిమ్ లో వర్కవుట్లు చేస్తూనో.. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూనో కనిపించే ఈ హాట్ బ్యూటీ ఫిట్ నెస్ పర్ ఫెక్ట్ గా మెయిన్ టెయిన్ చేస్తుంది.

ఈ భామ ఫిట్ నెస్ ఏ రేంజిలో మెయిన్ టెయిన్ చేస్తుందో తెలియజేసేలా తాజాగా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఇవి నెట్ లో తెగ వైరల్ అయ్యాయి. అందులో దిశా నడుము ఒంపులు చూసి మతులు పోగొట్టుకోని వారుండరు. ఇప్పుడు హీరోలంతా సిక్స్ ప్యాక్ సంపాదించడానికి తెగ ఎక్సర్ సైజులు చేస్తుంటే దిశా పఠానీ మాత్రం సెక్సీ ప్యాక్ సంపాదించాలో లెసన్స్ చెప్పేస్తోంది. అందమంటే ఇలాగే ఉండాలి.. వయ్యారమైన నడుమంటే ఇలాగే ఉండాలి అంటూ ఎత్తి చూపుతూ ధిశా ఇచ్చిన ఫోజులు అందరినీ మైమరపింపజేస్తున్నాయి.

వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన లోఫర్ సినిమాతో దిశా పఠాని ముందు టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అందులో అమాయకంగా బెదురుచూపుల్తో నటించిన ఈ భామ బాలీవుడ్ కెళ్లగానే బట్టలు తగ్గించి గ్లామర్ పెంచేసింది. జిమ్ లో సిక్స్ ప్యాక్ లకు పోటీగా సెక్సీ ప్యాక్ తో కట్టిపడేసిన క్రెడిట్ కచ్చితంగా దిశాదే.
Tags:    

Similar News