ఫోటో స్టోరి: లోఫ‌ర్ బ్యూటీ గుభేల్‌

Update: 2019-03-18 12:21 GMT
దిశా ప‌టానీ డేర్ డెవిల్ యాక్టివిటీస్ గురించి తెలిసిందే. అందాల ఆర‌బోత‌లో ఏమాత్రం అడ్డు చెప్ప‌ని ఈ టాప్ మోడ‌ల్ కం క‌థానాయిక గ‌త కొంత‌కాలంగా సంచ‌ల‌నాలే కేంద్రంగా స్వీయ‌ ప్ర‌చారంతో వేడెక్కిస్తోంది. అందాన్ని ఏమాత్రం దాచుకోని అమ్మ‌డిగా దిశా గురించి కుర్ర ప్ర‌పంచం కోడై కూస్తోంది. ఓవైపు బోయ్ ఫ్రెండ్ టైగ‌ర్ ష్రాఫ్ తో షికార్లు చేస్తూ, సినిమాల్లో న‌టిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మ‌రోవైపు ప్ర‌ఖ్యాత బ్రాండ్ల‌కు ప్ర‌చారం చేస్తూ వెబ్ ప్ర‌పంచాన్ని హీటెక్కిస్తోంది.

ఆ క్ర‌మంలోనే ప్ర‌ఖ్యాత కెల్విన్ క్లెయిన్ (సీకే) లోదుస్తుల‌కు ప్ర‌చారం చేస్తూ హాట్ టాపిక్ అయ్యింది. దీపావ‌ళి రోజు సీకే ల‌క్ష్మీ దేవి మీ ఇంటికి వ‌చ్చును! అంటూ తెలివైన ప్ర‌చారం చేప‌ట్టిన దిశా ఆ త‌ర్వాత ఆ బ్రాండ్ ని సొంత కంపెనీలా భావించి ప్ర‌చారం చేస్తోంది. తొలిసారి .. మ‌లిసారి ఈ అమ్మ‌డు లోదుస్తుల ప్ర‌క‌ట‌న‌లు వెబ్ లో దూసుకుపోయాయి. అందాల్ని ఆరాంగా ఎలివేట్ చేసే పొట్టి దుస్తుల ప్ర‌చారం గ్రాండ్ స‌క్సెసైంది. దిశా దెబ్బ‌కు కెల్విన్ క్లెయిన్ స్కైలోకి వెళ్లింది. యువ‌త‌రం మోజు ప‌డి మ‌రీ ఈ బ్రాండ్ ని కొనేస్తున్నార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

దిశా క్రియేట్ చేసిన ఒర‌వ‌డి ఏ రేంజులో వ‌ర్క‌వుటైందో ఆ త‌ర్వాత ప‌లువురు మోడ‌ల్స్, క‌థానాయిక‌లు అనుస‌రించిన విధానం చెప్పింది. ఇదిగో లేటెస్టుగా మ‌రోసారి రెడ్ హాట్ సీకే దుస్తుల‌తో అందాల పందేరం పెట్టింది లోఫ‌ర్ బ్యూటీ. ఫైర్ యాడెడ్ టు ద పెట్రోల్ అన్న చందంగా త‌న‌లోని లోఫ‌ర్‌త‌నాన్ని మ‌ళ్లీ బ‌య‌ట‌పెట్టేసిందిలా. కుర్ర‌కారుతో గిల్లి క‌జ్జాలు ఆడ‌డం.. త‌న‌కు కావాల్సిన ప్ర‌చారం కొట్టేయ‌డం ఈ అమ్మ‌డి హ్యాబిట్. అందుకు అడిక్ట్ అయిపోయిన వాళ్ల‌దే త‌ప్పు అన్న‌మాట‌!!  దిశా న‌టిస్తున్న భ‌ర‌త్ రిలీజ్ కి రావాల్సి ఉంది. అలాగే `భాఘి 3` ప‌నులు ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చాయో డీటెయిలింగ్ తెలియాల్సి ఉందికా.

Tags:    

Similar News