ఇండియన్ బేబీస్ కి హాలీవుడ్ ఛాన్స్ రావడం అంత తేలికైన విషయమేం కాదు. బాలీవుడ్ లో పాగా వేసేందుకే నానా తంటాలు పడుతూ ఉంటారు. కానీ ఏకంగా హాలీవుడ్ ఛాన్స్.. అందులోనూ జాకీచాన్ మూవీలో రోల్ అంటే, ఇక వాళ్ల ఆనందానికి పట్టపగ్గాలుండవు. ఇప్పుడు జాకీ చాన్ చేస్తున్న కుంగ్ ఫూ యోగాలో ఇద్దరు భారతీయ భామలకు అవకాశం వచ్చింది. అమైరా దస్తూర్ తోపాటు లోఫర్ పాప దిశా పాట్నీ కూడా హాలీవుడ్ వెళ్లిపోతోంది.
జాకీచాన్ మూవీలో ఏ చిన్న రోల్ అయినా చేసేస్తారు కానీ.. దిశాకి తగిలింది మాత్రం జాక్ పాట్ అనే చెప్పాలి. ఎందుకంటే.. కుంగ్ ఫూ యోగాలో ఈమె చేస్తున్న పాత్ర చాలా కీలకం. జాకీ చాన్ లవర్ గా కనిపించబోతోంది దిశా పాట్నీ. అంటే దాదాపు లీడ్ హీరోయిన్ రోల్ అన్నమాట. ఇందులో భూగర్భ శాస్త్రం.. అదేనండీ ఆర్కియాలజీ విభాగంలో ప్రొఫెసర్ గా దిశా కనిపించబోతోంది. ఈమెకు ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ వచ్చి ఉండడం.. ఈ కీలక రోల్ ఈమెకు దక్కడానికి అసలు కారణంగా తెలుస్తోంది.
టిబెట్ లోని ఓ నిధిని పసిగట్టడానికి జాకీ చాన్ ఇండియా వస్తాడు. ఇక్కడి నుంచి టిబెట్ బయలుదేరుతుంది బృందం. ఆ సమయంలో జాకీచాన్ కు సహాయం చేసే కేరక్టర్ లో దిశా పాట్నీ నటిస్తోందని అంటున్నారు. ఏమైనా డైరెక్టుగా హాలీవుడ్ కి జాకీచాన్ టికెట్ ఇచ్చేయడంతో.. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ కి మరింత పదును పెడుతోందీ లోఫర్ బేబీ.