25 లక్షల కోవిడ్ కేర్ హెల్త్ కిట్లను పంచాలి!-ర‌ష్మిక‌

Update: 2021-06-04 14:30 GMT
కోవిడ్ సెకండ్ వేవ్ క‌ల్లోలంలో ఎన్నో కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయి. ఉపాధి లేక నిత్యావ‌స‌రాలు అంద‌క అల్లాడే పేద‌లు ఒక‌వైపు ఆస్ప‌త్రిలో వైద్యం అంద‌క హెల్త్ కిట్లు అందుబాటులో లేక‌ ఎంద‌రో ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రి ఇలాంటి వాళ్ల‌ను ఆదుకోవాలంటే జాతీయ స్థాయిలో ఏదైనా ఒక స‌మూహం ప‌ని చేయాల్సి ఉంటుంది. చాలామంది సెల‌బ్రిటీలు ఎవ‌రికి వారు త‌మ‌కు తోచిన సాయం చేస్తూ మాన‌వ‌త‌ను చాటుకుంటున్నారు. ఈ క‌ష్ట‌కాలంలో మంచిని విస్త‌రిస్తున్నారు.

ఇక ఇందులో ఒక ప్ర‌త్యేక విభాగాన్ని ఎన్నుకుని `నేను సైతం` అంటూ ర‌ష్మిక మంద‌న త‌న‌వంతు ప్ర‌చార సాయానికి ముందుకొచ్చారు. ప్ర‌జాప్ర‌యోజ‌క‌త్వం కోసం తాను ఒక మంచి ఇనిషియేష‌న్ తీసుకున్నారు. ఈ ప‌నిలో భాగంగా ఇన్ స్టాగ్రామ్ లో తాజా వీడియో లో ర‌ష్మిక ఒక చ‌క్క‌ని సందేశాన్ని ఇచ్చింది. కోవిడ్-19 ఉపశమన కార్యక్రమాల కోసం పనిచేస్తున్న గ్రూప్ ల‌ను ప్రోత్సహిస్తూ ర‌ష్మిక‌ ఈ వీడియోను భాగస్వామ్యం చేసింది.  రష్మికకు దేశవ్యాప్తంగా అభిమానుల ఫాలోయింగ్ భారీగా ఉంది. త‌న‌ను నేషనల్ క్రష్ గా మ‌లిచింది ఇదే పాయింట్ తో ప్ర‌చారానికి ముందుకు వ‌చ్చింది.  

``అబ్బాయిలంతా సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాం. ప్రస్తుతం క‌ఠిన స‌మ‌యాన్ని ఎదుర్కొంటున్నాం. ఇదో స‌వాల్ గా మారింది. దీని నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఒకరికొకరు సహాయం చేయాలి. అందువల్ల 25 లక్షల కోవిడ్ కేర్ హెల్త్ కిట్లను ఉచితంగా పంపిణీ చేసే ఒక ప‌నిలో భాగ‌స్వాములు కండి. దీనికి విరివిగా ప్ర‌చారం చేయండి. ఇది ఏకం కావడానికి.. కలిసి పనిచేయడానికి.. ఇతరులను ప్రేరేపించడానికి స‌రైన‌ సమయం. కాబట్టి మీరు ఈ ముఖ్యమైన సందేశాన్ని అంద‌రికీ పంచుతార‌నే అనుకుంటున్నా. అవసరమైన వారికి సహాయపడండి`` అని తెలిపారు.

ర‌ష్మిక కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే పుష్ప లాంటి పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తోంది. ఆడాళ్లు మీకు జోహార్లు అనే చిత్రంలోనూ న‌టిస్తోంది. బాలీవుడ్ లో అమితాబ్ తో క‌లిసి గుడ్ బాయ్ అనే చిత్రంతో పాటు మ‌ల్హోత్రాతో క‌లిసి మిష‌న్ మంజులో న‌టిస్తోంది. మ‌రో బాలీవుడ్ చిత్రానికి క‌మిటైంది.
Tags:    

Similar News