సినిమా వ్యాపారమని చెబుతారు కానీ.. తరచి చూస్తే.. ఇది జూదానికి మించిందేనని చెప్పాలి. ఇందులో లాజిక్కులేమీ ఉండవు. కేవలం అంచనాలతో కోట్లాది రూపాయిల బిజినెస్ లు జరుగుతాయి. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే పెట్టిన కోట్లతో పాటు.. మరికొన్ని కోట్లు మిగులుతాయి. లెక్కలు తేడా వస్తే.. పెట్టిన కోట్లు పత్తా లేకుండా పోతాయ్. భారీ సినిమాలకు ఫ్యాన్సీ రేట్లు పెట్టేసి.. అడ్డంగా బుక్ కావటం.. ఆ తర్వాత భారీ నష్టాలు మూటగట్టుకొని లబోదిబో అనటం ఇప్పుడు తెలుగు.. తమిళ పరిశ్రమల్లో చూస్తున్నదే. తాజాగా ఇదే పరిస్థితి హిందీ చిత్రసీమకు అంటింది.
తాజాగా హృతిక్ రోషన్ నటించిన కాబిల్ సినిమాను ఫ్యాన్సీ రేట్లకు అమ్మేశాడు హీరో తండ్రి రాకేశ్ రోషన్. సొంత నిర్మాణ సంస్థకు చెందిన ఈ సినిమా మీద విపరీతమైన హైప్ క్రియేట్ కావటం.. దాన్ని అసరాగా చేసుకొని.. భారీగా లాభాలు జేబులో వేసుకున్నట్లుగా చెబుతున్నారు. పరిశ్రమ వర్గాల ప్రకారం.. దాదాపు రూ.80 కోట్ల మేర లాభాల్ని తన ఖాతాలోకి వేసుకున్న రాకేశ్ రోషన్.. సినిమా విడుదలై.. ఢాం అనటంతో..సినిమాను కొన్నవారు లబోదిబోమంటున్న పరిస్థితి.
తమకు జరిగిన నష్టాన్ని రాకేశ్ దృష్టికి తీసుకెళ్లి.. నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరితే రూ.15కోట్లు తిరిగి ఇచ్చేందుకు ఓకే అన్నట్లుగా వార్తలు వస్తున్నాయ్. మరోవైపు.. అలాంటిదేమీ లేదని..రూపాయి కూడా తిరిగి ఇచ్చేది లేదని.. సినిమా సూపర్ హిట్ అయ్యిందని.. కావాలనే తన సినిమాకు చెడ్డపేరు తీసుకురావటానికే ఇలాంటి ప్రచారం చేస్తున్నాడంటూ ఫైర్ అవుతున్నారు.
రాకేశ్ తీరు చూస్తుంటే.. సినిమా బాగా ఆడలేదంటే ఎక్కడ డబ్బులు తిరిగి ఇవ్వాలన్నట్లుగా ఉంది కానీ.. సినిమాలు చూసే చిన్నపిల్లాడ్ని అడిగినా.. కాబిల్ హిట్టా.. ఫట్టా అంటే ఇట్టే చెప్పేస్తాడు. అలాంటిది రాకేశ్ నోటి నుంచి వస్తున్న మాటలు చూస్తుంటే.. అతగాడి జేబులో పడ్డ కోట్లాది రూపాయిల్లో రూపాయి కూడా వెనక్కి ఇచ్చేందుకు సిద్ధంగా లేడని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/