మిడిల్ క్లాస్ కి కెమెరా తిప్పలు

Update: 2017-07-02 07:28 GMT
ఈ మధ్య టాలీవుడ్ లో సినిమాటోగ్రఫీపై ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. పక్క భాషల నుంచి కెమేరా డిపార్ట్ మెంట్ హ్యాండిల్ చేసే ట్యాలెంటెడ్ టెక్నీషియన్స్ ను బాగానే తీసుకొస్తున్నారు. మిగిలిన విభాగాల్లో కూడా పరాయి భాషలవారి ప్రవేశాలు ఎక్కువగానే ఉన్నా.. సినిమాటోగ్రఫీ విషయంలో మాత్రం దర్శకుడితో సినిమాటోగ్రాఫర్లకు విబేధాలు పెరుగుతున్నాయి.

సర్దార్ గబ్బర్ సింగ్ మూవీకి వర్క్ చేసేటపుడు సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్ కి.. దర్శకుడు బాబీకి విబేధాలు ఏర్పడ్డాయనే టాక్ వినిపించింది. జయనన్ వాకౌట్ చేశాడట కూడా. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న జై లవ కుశ విషయంలో బాబీకి బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ మురళీధరన్ కు పడలేదు. కెమేరామ్యాన్ ను రీప్లేస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇలాంటి సంఘటనే మరొకటి జరిగిందిని టాలీవుడ్ టాక్. నాని హీరోగా రూపొందుతున్న ఎంసీఏ.. మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రానికి దివకర్ మణి సినిమాటోగ్రాఫర్.

సమ్మర్ లో రిలీజ్ అయిన కేశవ మూవీలో తన కెమేరా పనితనం చూపించాడు కూడా. ఇప్పుడీ దివకర్ మణి.. ఎంసీఏ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు వేణు శ్రీరాంకు.. సినిమాటోగ్రాఫర్ కు అస్సలు పొంతన కుదరడం లేదట. క్రియేటివ్ డిఫరెన్స్ ల కారణంగా.. ఇక కలిసి వర్క్ చేయడం సాధ్యం కాదని ఫిక్స్ అయిన దివకర్ మణి.. ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పి వెళ్లిపోయాడని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News