సెలబ్రిటీ ప్రపంచంలో భార్యాభర్తల విడాకుల ప్రహసనం గురించి నిరంతర కథనాలు అభిమానులను కలవరపెడుతూనే ఉన్నాయి. ఇంతకుముందు నాగచైతన్య- సమంత.. అమీర్ ఖాన్- కిరణ్ రావు జంటలు విడిపోయినప్పుడు అభిమాన ప్రపంచం విస్తుపోయింది. ఇకపోతే విడాకులు తీసుకున్న హీరోలు హీరోయిన్లు ఆ తర్వాత కూడా ప్రేమాయణాలు సాగించి జీవితంలో సెటిలైన సందర్భాలున్నాయి.
హన్సిక మోత్వాని ఇప్పుడు ఆల్రెడీ విడాకులు తీసుకున్న యువకుడిని పెళ్లాడుతోంది. హన్సిక- కరీనా కపూర్ ఖాన్ - బిపాసా బసు విడాకులు తీసుకున్నవారిని వివాహం చేసుకున్న వారి జాబితాలో ఉన్నారు. ఈ డిసెంబర్ లోనే హన్సిక మోత్వానీ పెళ్లి. సోహెల్ ఖతురియాతో పెళ్లికి సిద్ధమైంది. ప్రేమకు ఏదీ అడ్డంకి కాదని నిరూపిస్తూ... హన్సిక అప్పటికే విడాకులు తీసుకున్న యువకుడిని ఎంపిక చేసుకుంది. సోహెల్ ఖతురియాలో హన్సిక మోత్వానీ ప్రేమను వెతుక్కుందని ఇంతకుముందే వార్తలు వచ్చాయి. ఈ ఏడాది డిసెంబర్ లో అతడితో పెళ్లికి సిద్ధమైంది. అతను పారిస్ లో ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఈ జంట లవ్ ప్రపోజల్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోహెల్ ఖతురియా ఇంతకు ముందు 2016లో రింకీని వివాహం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ బంధం బ్రేకప్ అయ్యింది. హన్సిక మోత్వాని పెళ్లి సంగతి ఇప్పుడు సౌతిండస్ట్రీ సహా బాలీవుడ్ లోను హాట్ టాపిక్ గా మారింది. విడాకులు తీసుకున్నవారితో ప్రేమలో పడిన ఇతర నాయికల గురించి పరిశీలిస్తే ఆసక్తికర సంగతులే తెలిసాయి.
కరీనా కపూర్ ఖాన్ .. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ను వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నారు. వారికి ఇద్దరు పిల్లలు - తైమూర్ - జెహ్. సైఫ్ అలీఖాన్ గతంలో అమృతా సింగ్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. సారా అలీ ఖాన్ - ఇబ్రహీం అలీ ఖాన్ వారి పిల్లలు. సైఫ్ సరసన పలు చిత్రాల్లో నటించిన కరీనా అతడితో నిండా ప్రేమలో మునిగింది. అంతకుముందు చాక్లెట్ బోయ్ షాహిద్ కపూర్ తో ప్రేమాయణం బ్రేకప్ గురించి తెలిసిందే.
బిపాసా బసు - కరణ్ సింగ్ గ్రోవర్ 2016లో వివాహం చేసుకున్నారు. ఆమెతో వివాహం కాకముందే కరణ్ సింగ్ గ్రోవర్ ఇద్దరి నుంచి విడాకులు తీసుకున్నాడు. రెండు విఫలమైన వివాహాలను ఎదుర్కొన్నాడు. అయితే బిపాస బసు సింహబలుడు జాన్ అబ్రహాంతో దాదాపు తొమ్మిదేళ్ల పాటు సహజీవనం చేసి విడిపోయిన సంగతి తెలిసిందే. అంతకుముందు మోడల్ డినో మోరియాతోను బిపాసా ఎఫైర్ సాగించిందని కథనాలొచ్చాయి.
షిబానీ దండేకర్ ఇటీవల ఫిల్మ్ మేకర్ ఫర్హాన్ అక్తర్ ని పెళ్లి చేసుకుని సెటిలైంది. ఆమె కంటే ముందు అతను అధునా భబానీతో దాదాపు 17 సంవత్సరాలు వైవాహిక జీవితంలో ఉన్నారు. ప్రస్తుతం షిబానీ- ఫర్హాన్ జోడీ బాలీవుడ్ హాటెస్ట్ కపుల్ గా వెలిగిపోతున్నారు.
సాహిల్ సంఘా నుంచి విడిపోయిన తర్వాత దియా మీర్జా తన స్నేహితుడు వైభవ్ రేఖీని పెళ్లి చేసుకుంది. అతను మొదట యోగా నిపుణురాలు సునైనాను వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఒక కుమార్తె ఉన్నారు. వైభవ్- దియా జంటకు ఒక కుమారుడు జన్మించాడు. వైభవ్ కుమార్తె సమీరాను దియా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు.
శిల్పాశెట్టి ది గ్రేట్ బిజినెస్ మేన్ రాజ్ కుంద్రాతో ప్రేమలో పడింది. 2009లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ అతను మొదట కవితను వివాహం చేసుకున్నాడు. 2006లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. శిల్పా శెట్టితో సాన్నిహిత్యం అనంతరం పెళ్లి.. పిల్లల గురించి తెలిసిందే. నీలిచిత్రాల యాప్ ల కేసులో రాజ్ కుంద్రా అరెస్టు కాగానే ఈ జంట కూడా విడిపోనుందని కొన్ని మీడియాలు కథనాలు వెలువరించాయి. కానీ దానిని ఇరువురు ఖండించారు.
అందాల నటి రాణి ముఖర్జీ ప్రముఖ ఫిలింమేకర్ ఆదిత్య చోప్రాకు రెండవ భార్య. 2001 నుండి 2009 వరకు పాయల్ ఖన్నాతో వైవాహిక జీవితం కొనసాగించిన చోప్రా ఆ తర్వాత భార్య నుంచి విడిపోయారు. ఆ తరవాత అతను రాణి ముఖర్జీని వివాహం చేసుకున్నాడు. బాలీవుడ్ లో ఈ తరహా విచ్ఛిన్న కుటుంబాలు వివాహాల గురించి నిరంతరం ఏవో వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. అమీర్ ఖాన్ ప్రస్తుతం ఓ యువకథానాయికతో రిలేషన్ షిప్ లో ఉన్నాడని .. నాగచైతన్య ఓ టాప్ బ్యూటీతో ప్రేమలో ఉన్నాడని కూడా గుసగుసలు ఉన్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.