భర్తకు విడాకులు ఇచ్చేసి కొత్త బంగారు లోకంలో విహరిస్తున్నా!

Update: 2021-02-10 00:30 GMT
తెలుగు ప్రేక్షకులకు కొత్త బంగారు లోకం సినిమాతో పరిచయం అయిన శ్వేత బసుప్రసాద్‌ కెరీర్‌ లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. హీరోయిన్ గా మంచి స్టార్ట్‌ లభించినా కూడా ఆమె దాన్ని వినియోగించుకోవడంలో విఫలం అయ్యింది. ఆమె సినీ కెరీర్‌ మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితం కూడా గందరగోళంగా మారిపోయింది. ఆమె చెప్పుకోలేని కేసులో అరెస్ట్‌ అవ్వడంతో పాటు కొంత కాలం జైలు లాంటి జీవితాన్ని గడిపింది. మళ్లీ మామూలు మనిషి అయ్యింది నటిగా మారి బిజీ అవుతుందని భావించిన సమయంలో మరో కుదుపు ఆమె ఎదుర్కొంది.

పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే ఆమె భర్త నుండి విడిపోయింది. పెళ్లి బ్రేకప్‌ గురించి మాట్లాడుతూ తాను డిప్రెషన్‌ లో ఉన్న సమయంలో అతడు పరిచయం అయ్యాడు. ఆ సమయంకు నాకు  మరో ఆప్షన్‌ కనిపించలేదు. దాంతో నేను అతడిని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత నా ఫ్రీడమ్‌ పోయింది.

ఏం చేయాలన్నా కూడా ఆంక్షలు ఉండేవి. దానికి తోడు అనేక సమస్యలు ఇద్దరి మద్య ఉండేవి. దాంతో విడిపోవడమే కరెక్ట్‌ అని భావించి ఎవరికి వాళ్లం అయ్యాం. విడిపోయిన తర్వాత చాలా స్వేచ్చగా అనిపిస్తుంది. సరికొత్త లోకంలో బంగారు లోకంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది అన్నట్లుగా శ్వేత బసు ప్రసాద్‌ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఇండియా లాక్‌ డౌన్ అనే సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాలో ఈమె వ్యభిచారి పాత్రలో కనిపించబోతుందట. లాక్‌ డౌన్‌ సమయంలో వ్యభిచారులు పడ్డ కష్టాలను గురించి ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. హీరోయిన్ గా మరోసారి ప్రయత్నాలు చేస్తున్న శ్వేత బసు కు ఈ సారి అయినా కలిసి వచ్చేనా అనేది చూడాలి.
Tags:    

Similar News