టాలీవుడ్ లో చాలామంది మిస్సులు కథానాయికలుగా ట్రయల్స్ వేశారు కానీ చాలా అరుదుగా మాత్రమే అగ్ర నాయిక హోదాని అందుకోగలిగారు. నేటితరంలో ఆల్మోస్ట్ ప్రతి కథానాయిక మోడలింగ్ నుంచో లేదా అందాల పోటీల నుంచో వచ్చి ఇక్కడ ప్రయత్నిస్తున్నారు. ఇదే కేటగిరీకి చెందుతుంది నేహాశెట్టి. ఈ భామ మిస్ ఇండియా పోటీల్లో సౌత్ నుంచి మెరుపులు మెరిపించింది. 2015 మిస్ సౌతిండియా రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత కన్నడలో తెరంగేట్రం చేసి ఇప్పుడు తెలుగులోనూ ఈ భామ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది.
డీజే టిల్లు చిత్రంతో సిద్ధూ సరసన నేహా నటించింది. ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా మహమ్మారీ వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. టీజర్ ట్రైలర్ సహా ప్రతిదీ అంతర్జాలంలో దూసుకెళ్లాయి. డీజే టిల్లుతో నేహా శెట్టి ఘాటైన లిప్ లాక్ లు యూత్ కి కనెక్టయ్యాయి. గ్లామరస్ నాయికగానూ గుర్తింపు తెచ్చుకుంది. నేహా శెట్టికి తెలుగు కెరీర్ పరంగా మరిన్ని అవకాశాలు రావాలంటే డీజే టిల్లు హిట్టు కొట్టాల్సిందే.
అందానికి అందం ప్రతిభ ఉన్నా సరైన సక్సెస్ గ్రాఫ్ ని పెంచుతుంది. ఫిబ్రవరి 11న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సితార ఎంటర్ టైన్ మెంట్స్ సన్నాహకాల్లో ఉంది.
అన్ని పనులు పూర్తిచేసుకుని సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ప్రచారాన్ని టీమ్ వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ఇటీవల ఈ సినిమాలోని పాటల్ పిల్ల అంటూ సాగే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేయగా అంతర్జాలంలో దూసుకెళ్లింది. పాటలో నేహాశెట్టి లుక్..పెర్పార్మెన్స్..అందం ఆకట్టుకుంది. అనిరుధ్ ఆలపించిన ఈ పాట సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయం. పాట ఆద్యంతం శ్రోతల్ని ఆకట్టుకుంటుంది. ఈ పాటకి కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించగా..శ్రీచరణ్ పాకాల స్వరపరిచారు.
ఇంకా సినిమాలో మరిన్ని పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. ఇది చక్కని యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. క్యాచీ టైటిల్ తో సినిమా ప్రేక్షకులకు ఇప్పటికే కనెక్టయ్యింది. రిలీజ్ అయితే ప్రచార చిత్రాలు సినిమాకి మంచి బజ్ ని తీసుకొచ్చాయి. ఇందులో ప్రిన్స్ సిసిల్ ..బ్రహ్మాజీ...ప్రగతి..నర్రా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. విమల్ కృష్ణ- సిద్దు రచన దర్శకత్వం వహిస్తున్నారు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగ్ చాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. ధీరజ్ మెగిలినేని ఎగ్జిక్యూటివ్ నిర్మాత.