ఈ శతాబ్దపు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను బాలీవుడ్ షాహెన్‌షాగా పరిగణిస్తారు. 80 వయసులోనూ ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ అసాధారణం. సామాన్య ప్రేక్షకులే కాదు.. ఇండస్ట్రీలోని చాలా మంది సెలబ్రిటీలు కూడా అమితాబ్ బచ్చన్ కి అభిమానులుగా ఉన్నారు. యుక్తవయసులో ఆయన సినిమాల కోసం ఎంతగా తపించేవారో.. ఇప్పుడు కూడా అంతకుమించి ఉత్సాహంతో నటిస్తున్నారు. నేటికీ కూడా అంతే ఉత్సాహంతో దూసుకెళుతున్నారు. అమితాబ్ బచ్చన్ తన కెరీర్ లో ఎన్నో గొప్ప బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. అభిమానులు అమితాబ్ కి దేవుడి హోదాని కట్టబెట్టారంటే అతిశయోక్తి కాదు.
ప్రతి ఆదివారం ప్రజలు అతని ఇంటి వెలుపల గుమిగూడతారు. వారు తమ అభిమాన నటుడి తో ఫోటోలు దిగేందుకు అక్కడికి చేరుకుంటారు. ఈ ప్రేమ -విజయం కోసం అమితాబ్ చాలా కష్టపడ్డాడు. కేవలం 500 రూపాయల జీతానికి పనిచేసిన అమితాబ్ ఈరోజు ఒక్కో సినిమా కోసం ఆరు కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడు. తన కెరీర్ లో గౌరవం కీర్తితో పాటు అమితాబ్ బచ్చన్ విలాసవంతమైన జీవనశైలిని కూడా సంపాదించాడు. ఈరోజు అమితాబ్ వందల కోట్ల ఆస్తికి యజమాని.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు ముంబైలో ఐదు బంగ్లాలు ఉన్నాయి. కొన్ని బంగ్లాల పేర్లను పరిశీలిస్తే.. వాటిలో జల్సా- జనక్- ప్రతీక్ష - వత్స అనే పేర్లు ఉన్నాయి. ముంబైలోని జుహు ప్రాంతంలోని జల్సా బంగ్లాలో అమితాబ్ తన కుటుంబంతో నివసిస్తున్నారు. ఈ బంగ్లా ఖరీదు దాదాపు రూ.100 కోట్లు. `సత్తె పే సత్తా` చిత్రం విజయం సాధించిన తర్వాత ఈ బంగ్లాను దర్శకుడు రమేష్ సిప్పీ పారితోషికం చెల్లింపుగా బిగ్ బికి ఇచ్చారు.
అతని రెండవ బంగ్లా ప్రతీక్ష విలువ 160 కోట్లు. అతను తన తండ్రితో నివసించాడు. అతనికి బిగ్ బి జనక్ బంగ్లాలో ఆఫీసు ఉంది. ఇది కాకుండా ఉత్తరప్రదేశ్ అలహాబాద్ జిల్లాలో అతని పూర్వీకుల నివాసం కూడా ఉంది. అమితాబ్ ఈ స్థలాన్ని ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గా మార్చారు. అతనికి దేశవ్యాప్తంగా అనేక ఇతర ఆస్తులు కూడా ఉన్నాయి. మీడియా కథనాల ప్రకారం ఫ్రాన్స్‌లో కూడా అమితాబ్ బచ్చన్ కి ఆస్తి ఉంది.
మీడియా నివేదికల ప్రకారం.. అమితాబ్ బచ్చన్ వద్ద 11 లగ్జరీ వాహనాలు ఉన్నాయి. అతని కార్ల సేకరణలో రోల్స్ రాయిస్- ల్యాండ్ రోవర్- పోర్స్చే- బెంట్లీ- మెర్సిడెస్ -BMW ఉన్నాయి. ఈ కార్ల విలువ కోట్లలో ఉంటుంది.
అమితాబ్ బచ్చన్ సంపాదన గురించి ప్రస్థావిస్తే.. అతను ప్రధానంగా సినిమాల ద్వారా సంపాదిస్తాడు. ఇది కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా కూడా అమితాబ్ భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. బిగ్ బి ఒక సినిమాకు దాదాపు రూ.6 కోట్లు తీసుకుంటే, .. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం రూ.5 కోట్లు తీసుకుంటాడు. అమితాబ్ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు. అతను US టెక్ కంపెనీతో సహా జస్ట్ డయల్ లో పెట్టుబడులను కలిగి ఉన్నాడు. కొడుకుతో కలిసి క్రిప్టో కరెన్సీలోనూ భారీ పెట్టుబడులు పెట్టారని కథనాలొచ్చాయి.
బిగ్ బి నికర ఆస్తుల విలువ 410 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ రూపాయలలో 3190 కోట్ల రూపాయల మొత్తం ఆస్తులను కలిగి ఉన్నారు. అమితాబ్ ఏడాదికి రూ. 60 కోట్లు సంపాదిస్తుండగా....ఒక నెలలో రూ. 5 కోట్లకు పైగా సంపాదిస్తున్నాడు. 80 వయసులో ఇప్పటికీ ఆదాయాన్ని పెంచుకుంటూనే ఉన్నాడు. అంతకుమించి అభిమానాన్ని గౌరవాన్ని ప్రేమను ప్రజల నుంచి దక్కించుకున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.