ఈ స్టార్స్ ఒకరోజు సంపాదన ఎంతో తెలుసా?!

Update: 2022-08-23 05:04 GMT
బాలీవుడ్ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. అందువల్లనే అక్కడ పోటీని తట్టుకుంటూ .. కలబడుతూ నిలబడటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. అక్కడ నెంబర్ వన్ అనిపించుకోవడం అంత తేలికైన పనేం కాదు. యాక్టింగ్ లో ప్రత్యేకత .. అంతవరకూ ఎవరూ చూపించని ఒక స్టైల్ ..

ఎంచుకునే కథలు .. వాటి వెంట వచ్చే హిట్లు .. ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ దగ్గర తమ పేరుతో ఉండవలసిన రికార్డులు ఇవన్నీ కూడా ప్రధానమైన పాత్రను పోషిస్తూ వస్తుంటాయి. వీటన్నిటికీ  తట్టుకుంటూ ఎక్కువ  కాలం నిలబడిన హీరోగా మనకి అమితాబ్ కనిపిస్తారు.

అమితాబ్ అంటే ఒక చరిత్ర .. ప్రతి ఒక్కరూ చదువుకోవలసిన పాఠం ఆయన జీవితం. ఎప్పటికప్పుడు కొత్త తరాలను ఎదుర్కుంటూ ఆయన సుదీర్ఘమైన ప్రయాణాన్ని కొనసాగించారు. అమితాబచ్చన్ కార్పొరేషన్ అనే సంస్థను స్థాపించి సినిమాలను నిర్మించిన ఆయన ఆర్ధికపరమైన సమస్యలను ఎదుర్కొన్నారు. 'కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమానికి హోస్ట్ గా దక్కిన అవకాశంతో మళ్లీ పుంజుకున్నారు. రోజుకి 1.2 కోట్లను ఆయన సంపాదిస్తారనీ, ఆయన ఆస్తుల విలువ 3,995  కోట్లు ఉంటుందని ఒక టాక్.

అమితాబ్ తరువాత సల్మాన్ ..  షారుక్ .. ఆమిర్ ముగ్గురూ కూడా ఒకే స్క్రీన్ ను షేర్ చేసుకున్నట్టుగా బాలీవుడ్ ను ఎలేస్తూ వస్తున్నారు. సల్మాన్ ఫ్లాప్ సినిమా కూడా 100 కోట్లను వసూలు చేస్తుందంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందనేది అర్థం చేసుకోవచ్చు. 'బీయింగ్ హ్యూమన్' అనే పేరుతో ఆయనకి సొంత బ్రాండ్ ఉంది. 'పన్వేల్' ప్రాంతంలో ఆయనకి 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంది. రోజుకి కోటి రూపాయలు సంపాదిస్తున్న ఆయాన ఆస్తి, 2,875 కోట్లు ఉండొచ్చని ఒక అంచనా.

ఇక షారుక్ విషయానికి వస్తే రెడ్ చిల్లీస్ అనే నిర్మాణ సంస్థ ఉంది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన సంస్థ ఉంది .. కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి ఆయన యాజమాని. ఇలా ఆయన అన్నిరకాలుగా బిజీ. రోజుకి 1.40 కోట్లు సంపాదించే షారుక్ ఆస్తుల విలువ 5, 593 కోట్లు ఉండొచ్చని అంటారు. ఆమిర్ విషయానికి వస్తే రోజుకి 33.50 లక్షలను సంపాదించే ఆయన ఆస్తులు 1800 కోట్ల వరకూ ఉండొచ్చని చెబుతారు. ఇక అక్షయ్ కుమార్ ఏడాదికి మూడు సినిమాల వరకూ చేస్తూ ఉంటాడు. రోజుకి కోటి సంపాదించే ఆయన ఆస్తుల విలువ 2,596 కోట్లు ఉండొచ్చని చెప్పుకుంటూ ఉంటారు.

ఇలా ఈ బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా సినిమాల ద్వారా ..  యాడ్స్ ద్వారా .. ఇతర  సంస్థల నుంచి వచ్చే ఇన్ కమ్ ద్వారా తిరుగులేని సంపన్నులుగా కొనసాగుతున్నారు. అందువలన ఒక సినిమా ఫ్లాప్ అయితే అది వాళ్లు ఒక ప్రయత్నంగా .. ప్రయోగంగా మాత్రమే భావించే అవకాశం ఉంది. కంగారుపడిపోయి కాళ్లుతొక్కుకునే పరిస్థితుల్లో వారు లేరు. కాకపోతే తమ క్రేజ్ .. మార్కెట్ తగ్గకుండా చూసుకోవడం పైనే వాళ్లు దృష్టి పెడుతుంటారు. అందుకోసమే పరిగెడుతుంటారంతే!
Tags:    

Similar News