మెగా కష్టం విలువ ఎంతో తెలుసా... ?

Update: 2022-01-01 12:30 GMT
మెగాస్టార్. వెండితెర వేలుపు. కమర్షియల్ మూవీకి సరికొత్త అర్ధం చెప్పిన మహా నటుడు. ఒక తెలుగు సినిమా ఫస్ట్ టైమ్ పది కోట్లు కలెక్ట్ చేయగలదని రుజువు చేసిన ఘనాపాటి, మేటి మన‌ మెగాస్టారు. చిరంజీవి ఇపుడు ఆరున్నర పదుల వయసులో ఉన్నారు. అయినా నాటౌట్ అంటున్నారు. నటనే తన ప్రాణమని చెబుతున్నారు.

ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో నటించిన ఆచార్య మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. ఫిబ్రవరిలో ఈ సినిమా థియేటర్లలోకి రావడం పక్కా. ఇక ఈ మూవీ తరువాత కూడా ఎక్కడా తగ్గకుండా అయిదు సినిమాలను లైన్ లో పెట్టేశారు చిరంజీవి.

అందులో గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరన్న, భోళా శంకర్ తో పాటు మరో రెండు సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు మరో రెండు మూవీస్ కి కూడా మెగాస్టార్ కమిట్ అవుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇప్పటికి ఆచార్యతో కలుపుకుంటే 153 సినిమాలు చేసిన మెగాస్టార్ ఈ ఏడింటితో కలిపి 160 మార్క్ కి చేరాలని చూస్తున్నారు.

ఇక మరో మూడు నాలుగేళ్ల పాటు సీరియస్ గా నటిస్తూ పోవాలని కూడా ఆయన ఫిక్స్ అయ్యారు. తన సినీ కెరీర్ ని 175 సినిమాతో ఫుల్ స్టాప్ పెట్టాలన్నది ఆయన కోరిక అంటున్నారు. తన టోట్ల కెరీర్ లో 175 సినిమాలు చేశాను అన్న తృప్తితో రిటైర్ కావాలని ప్లాన్ చేసుకుంటున్నరు అని తెలుస్తోంది. ఈ లెక్కన మెగాస్టార్ ఆ నంబర్ కి రీచ్ కావాలీ అంటే ఏడాదికి సగటున నాలుగు సినిమాలు చేయాలి.

అలా చేస్తే అయిదేళ్లలో ఆయన తన టార్గెట్ రీచ్ అవుతారు. మెగాస్టార్ అందుకే ఇపుడు బిజీగా ఉన్నారని అంటున్నారు. ఇక మెగాస్టార్ సినిమాకు నలభై కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని కూడా ప్రచారం అయితే ఉంది. దాంతో ప్రస్తుతం సెట్స్ మీద మూవీస్ తో పాటు కమిట్ అయిన అయిదు సినిమాల విలువ కచ్చితంగా రెండు వందల కోట్ల దాకా ఉందని చెబుతున్నారు.

ఇదే స్పీడ్ లో మరిన్ని సినిమాలు చేయడం ద్వారా మెగాస్టార్ ఏడాదికి రెండు వందల కోట్లకు పైగా ఆర్జిస్తారు అంటున్నారు. మొత్తానికి మెగాస్టార్ కష్టానికి ప్రతిఫలం ఎంత అని అడిగింతే జవాబు ఇదీ అని కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోవచ్చు కానీ ఆయన సినిమా థియేటర్లో రిలీజ్ అయితే సగటు ప్రేక్షకుడికి మాత్రం తన కష్టం పూర్తిగా మరచిపోయి సరికొత్త ఎనర్జీ రావడం ఖాయం. అంటే మెగాస్టార్ కష్టానికి కరెక్ట్ రిజల్ట్ ఏమిటి అన్నది ఆలోచిస్తే సగటు శ్రమ జీవి పెదవుల మీద చిరునవ్వు అన్న జవాబు వస్తుంది అన్నమాట. ఏది ఏమైనా మెగాస్టార్ స్పూర్తిగా తీసుకుని మిగిలిన హీరోలు కూడా జోరుగా సినిమాలు చేస్తే టాలీవుడ్ లో చాలా బాగుంటుంది అని అంతా అంటున్నారు.


Tags:    

Similar News