దాదాపు దశాబ్ధం క్రితం విడుదలైంది అవతార్. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బ్రేకింగ్ హిట్ చిత్రంగా సంచలనాలు సృష్టించింది. దానికి ముందే ఈ మూవీ ట్రైలర్ వెబ్ లో సునామీని తలపించింది. విజువల్ మాయా ప్రపంచం అంటే ఏమిటో ప్రపంచానికి క్లారిటీగా చెప్పింది ఈ మూవీనే. ప్రజల్లో మ్యాడ్ నెస్ క్రియేట్ చేసిన గొప్ప చిత్రంగా నిలిచింది. అవతార్ స్ఫూర్తితో ఆ తర్వాత ఎన్నో ఫ్రాంఛైజీలు గొప్ప విజువల్ ఫీస్ట్ ని అందించాయి. ఇప్పుడు అలాంటి గ్రేట్ ఫ్రాంఛైజీ నుంచి సీక్వెల్ వస్తోంది. డిసెంబర్ లో అవతార్ 2 రిలీజ్ కి వస్తోంది. అంతకుముందు అవతార్ ట్రైలర్ ని వీక్షించేందుకు జనం థియేటర్లకు క్యూకడుతుండడం ఆసక్తికరం.
డిస్నీ సంస్థ ఎంతో తెలివిగా ఈ వారంలో విడుదలకు సిద్ధమవుతున్న డాక్టర్ స్ట్రేంజ్ మూవీతో అవతార్ ట్రైలర్ ని కేవలం థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తోంది. డిస్నీ తాజా చిత్రం మల్టివర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్ లో `డాక్టర్ స్ట్రేంజ్` అడ్వాన్స్ బుకింగ్ లు భారతదేశంలో రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమన్న చర్చ సాగుతోంది. టికెట్ల బుకింగ్ పూర్తి స్వింగ్ లో సాగుతోందని టాక్. మార్వెల్ - జేమ్స్ కామెరాన్ అభిమానుల ఉత్సాహాన్ని మరింతగా పెంచేందుకు అవతార్ 2 టీజర్ ట్రైలర్ ను ఇదే థియేటర్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసారు. ది మార్వెల్ బిగ్-టికెట్ ఎంటర్ టైనర్ తో ప్రత్యేకంగా `అవతార్- ది వే ఆఫ్ వాటర్` ట్రైలర్ ని రిలీజ్ చేస్తుండడం ఆసక్తిని పెంచుతోంది. ఈ నెల 6 నుంచి డాక్టర్ స్ట్రేంజ్ మూవీ భారతదేశంలో మల్టీప్లెక్స్ ఆడియెన్ కి ట్రీటివ్వనుంది.
డాక్టర్ స్ట్రేంజ్ కి .. అవతార్ ది వే ఆఫ్ వాటర్ ప్రివ్యూ జోడించారని .. మే 6న థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారని ఇంతకుముందే సినిమా కాన్ ఈవెంట్లో ఖరారు చేయడం ఉత్కంఠను పెంచింది. ఇప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ ఈ వారంలో విడుదలకు సిద్ధమవుతున్నందున పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేలా అవతార్ ట్రైలర్ ప్రచారం కలిసొస్తోందట.
డాక్టర్ స్ట్రేంజ్ విజువల్ ట్రీట్‌తో పాటు జేమ్స్ కామెరూన్ దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సీక్వెల్ అవతార్ 2 టైటిల్ ను డిస్నీ వెల్లడించింది - గత వారం సినిమాకాన్ లో ప్రదర్శించిన అవతార్ 2 మొదటి 3D టీజర్ ట్రైలర్ ని.. ప్రస్తుతం లాస్ వెగాస్ - సీజర్ ప్యాలెస్ లో జరుగుతున్న సినిమా థియేటర్ యజమానుల వార్షిక సమావేశంలోనూ ప్రదర్శించారు.
ప్రఖ్యాత హాలీవుడ్ మీడియా `డెడ్ లైన్` వివరాల ప్రకారం.. `అవతార్: ది వే ఆఫ్ వాటర్` పార్ట్ 1 ముగింపు సంఘటనల తర్వాత ఒక డికేడ్ తర్వాత కథ మొదలవుతుందట. జేక్ - జో సల్దానా- నేయితిరి జీవితాలలో తదుపరి అధ్యాయాన్ని తెరపై చూపిస్తున్నారు. సుల్లీ కుటుంబం కథను చెప్పడంతో మూవీ ప్రారంభమవుతుంది. జేక్- నేయితిరి వారి పిల్లలు వారిని అనుసరించే ఇబ్బందులు.. ఒకరినొకరు సురక్షితంగా ఉంచుకోవడానికి వారు పడే శ్రమ.. ఇతర ప్రమాదకర సమాజం నుంచి సజీవంగా ఉండటానికి వారు చేసే పోరాటాలు .. వారు అనుభవించే విషాదాలు ఇవన్నీ రెండో భాగంలో తెరకెక్కించారు.``మేము ఎక్కడికి వెళ్లినా ఈ కుటుంబం మాకు కోట`` అనే డైలాగ్ కి తగ్గట్టుగా థీమ్ రన్ అవుతుందట.
ది హాలీవుడ్ రిపోర్టర్ లో గత నివేదిక ప్రకారం అవతార్ 2 ని 3D మరియు 4Kతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్ కాన్ఫిగరేషన్ లకు జత కుదిరేలా హై ఫ్రేమ్ రేట్‌ను చేర్చడానికి Avatar 2 అనేక రకాల ఫార్మాట్ లలో రెడీ అయ్యి బరిలోకి దిగిపోతోందని సమాచారం.
సినిమాల చరిత్రలో నెవ్వర్ బిఫోర్ అనేలా ఏ ఇతర సినిమాతో పోల్చినా అవతార్ 2 కి ఊహించనని వెర్షన్లు ఉంటాయి అని మంగళవారం సినిమాకాన్ వేడుకల్లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ థియేటర్ ఓనర్స్ ప్రెసిడెంట్ - CEO జాన్ ఫిథియన్ నొక్కి చెప్పారు. “మేము అధిక రిజల్యూషన్, .. అధిక ఫ్రేమ్ రేట్లు,.. 3D- IMAX- PLF లను అనుసంధానించిన విభిన్న సౌండ్ సిస్టమ్ లతో ట్రైలర్ వస్తోంది. 160 విభిన్న భాషల్లో మూవీని రిలీజ్ చేస్తాం..సినిమాని అత్యుత్తమంగా చూపించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా సభ్యులతో చాలా సన్నిహితంగా పనిచేస్తున్నాం`` అని ఆయన చెప్పారు. డాక్టర్ స్ట్రేంజ్ చిత్రం 2022 మే 6 న ఇంగ్లీషు- హిందీ- తమిళం- తెలుగు- కన్నడ- మలయాళంలో విడుదలవుతోంది.