'గీతగోవిందం' హిట్ తో దర్శకుడు పరశురాం ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. కథాబలంతోనే సినిమా 100 కోట్ల వసూళ్లని సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ చూసే సూపర్ స్టార్ మహేష్ 'సర్కారు వారి పాట' కి పనిచేసే అవకాశం కల్పించారు అన్నది వాస్తవం. లేదంటే మహేష్ సక్సెస్ లు లేని వారిని అస్సలు దగ్గరకి కూడా రానివ్వరు.
సక్సెస్ లు ఇచ్చి ఫెయిలైన వారిని సైతం దరి చేరనివ్వరు. ఈ లిస్ట్ లో పూరి జగన్నాధ్..శ్రీను వైట్లని చెప్పుకొవచ్చు. కేవలం సక్సెస్ లు..ఫామ్ ని కొనసాగించే మేకర్స్ కే మహేష్ అవకాశం ఇస్తారు. అలా పరశురాం మహష్ కాంపౌండ్ లో వచ్చి చేరారు అన్నది వాస్తవం. అంతకు ముందు పరశురాం గీతా ఆర్స్ట్ లో రెండు సినిమాలకు పనిచేసారు. శిరీష్ తో 'శుభమస్తు'.. విజయ్ తోనూ సినిమా చేసాడు. అప్పటి నుంచి ఆ సంస్థతో ...అల్లు అరవింద్ తో మంచి రిలేషన్ కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పరశురాం బన్నీతో సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారంలోకి వచ్చింది. బన్నీ కి కొన్ని కథలు చెప్పాడనని కానీ అతనికి నచ్చపోవడంతో తగ్గాల్సి వస్తోందని...ఆ క్రమంలోల సర్కారు వారి కథ కూడా బన్నికి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. తాజాతా ఈ ప్రచారాన్ని పరశురాం కొట్టి పారేసారు. ఇది కేవలం మహేష్ ని ఓన్ చేసుకుని రాసుకున్న కథ. ఎవరికీ చెప్పలేదు.
''ఈ కథ విన్న ఒకే ఒక్కడు మహేష్. ఆయనకి కథ నచ్చింది. అందుకే సింగిల్ సిట్టింగ్ లో ఒకే చేసారు. ఆయన మాత్రమే చేయగల పాత్ర. ఆయన కోసమే పుట్టిన కథ ఇది. నిజానికి మహష్ కి -నాకు అస్సలు పరిచయమే లేదు. నేను అప్పాయింట్ మెంట్ తీసుకునే సరికి నేను ఎవర్నో అతనికి తెలియదు. కేవలం నా కథ నచ్చి ఆయన సినిమా చేయడానికి ఒప్పుకున్నారు అని తెలిపారు. మహేష్ తో సినిమా చేయడం పరశురాం కల.
పూరి జగన్నాధ్ ని స్పూర్తిగా తీసుకుని పరశురాం పరిశ్రమకి వచ్చారు. తొలుత పూరి వద్దనే సహాయ దర్శకుడిగా పనిచేసారు. కొంత ప్రావీణ్యం వచ్చిన తర్వాత వేర్వేరు దర్శకుల వద్ద పనిచేసి మేకర్ గా పట్టుసాధించారు. అటుపై దర్శకుడిగా చిన్న సినిమాలతో ప్రయాణం మొదలు పెట్టి నేడు మహేష్ నే డైరెక్ట్ చేసారు. ఈ జర్నీలో ఎన్నో సాదకబాధకాలున్నాయి.
పరశురాం తదుపరి ప్రాజెక్ట్ యువ సామ్రాట్ నాగచైతన్యతో ఉంటుంది. వాస్తవానికి 'గీతగోవిందం' పూర్తయిన వెంటనే చై ప్రాజెక్ట్ నే సెట్స్ పైకి తీసుకెళ్లాలి. కానీ అనివార్య కారణాల వల్ల కుదరలేదు. ఇప్పుడు చై కోసం రాసుకున్న కథతోనే ముందుకు వెళ్లబోతున్నారు పరశురాం.