నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన `టక్ జగదీష్` చిత్రానికి థమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 10న ఓటీటీలో కి వస్తున్న ఈ చిత్రంపై అంచనాల్ని పెంచింది ఆడియో. అయితే ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించింది మాత్రం గోపీ సుందర్. ఈ విషయంలో థమన్ కి గోపీ సుందర్ చాలా సహకరించారట. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఎస్.ఎస్. థమన్ వెల్లడించారు. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. గతంలో గోపీ సుందర్ సంగీతం అందించిన `మజిలీ` చిత్రానికి థమన్ నేపథ్య సంగీతం అందించారు.
ఆ సినిమాలో ఆర్.ఆర్ అద్భుతంగా వర్కవుటైంది. గోపీ సుందర్ సంగీతం అందించిన ఆ సినిమా మ్యూజికల్ గా పెద్ద సక్సెస్ అయింది. రిలీజ్ తర్వాత నేపథ్య సంగీతంలోనూ ఎక్కడా తగ్గలేదు. ఆ క్రెడిట్ మాత్రం థమన్ దే. గోపీ సుందర్ కోరడంతో థమన్ నేపథ్య సంగీతం అందించారు. అప్పుడు థమన్.. ఇప్పుడు గోపీ సుందర్ ఇలా ఒకరి కోసం మరొకరు కలిసి మెలిసి పనిచేయడం ఆసక్తికర విషయం. ఆ మ్యూజికల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఎమోషనల్ లవ్ స్టోరీ `మజిలీ` భారీ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు అదే కాంబో పని చేసిన టక్ జగదీష్ హిట్ ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. `మజిలి` సెంటిమెంట్ `టక్ జగదీష్` కి తప్పక పనిచేస్తుందని యూనిట్ ధీమాను వ్యక్తం చేస్తోంది.
కరోనా క్రైసిస్ నేపథ్యంలో.. ఎన్నో అవాంతరాలు దాటుకుని చివరికి `టక్ జగదీష్` సెప్టెంబర్ 10న ఓటీటీలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లో రిలీజ్ చేయాలని ఎగ్జిబిటర్ల పట్టు పడుతున్న నేపథ్యంలో నాని వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నాని విమర్శల్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎగ్జిబిటర్లు.. నాని నువ్వా నేనా? అనుకునే పరిస్థితి. చివరికి ఎవరి తప్పును వారు తెలుసుకుని అంతా కామ్ అప్ అయ్యారు. అంతిమంగా సినిమా నిర్మాత నిర్ణయం మేరకు ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.
టక్ జగదీష్ కథాకమామీషు ఇదీ..
ప్రతిసారీ వైవిధ్యం ఉన్న పాత్రలతో ఆకట్టుకున్న నానీ పక్కింటి అబ్బాయి పాత్రల్లోనూ తనదైన మార్క్ చూపించి మెప్పించారు. ఇప్పడు ప్రజా సమస్యలను పరిష్కరించే ఎమ్మార్వో గా అతడు నటించాడని తెలుస్తోంది. టక్ జగదీష్ అనే అధికారిగా నాని విన్యాసాలు తెరపై వీక్షించే సమయమాసన్నమైంది. టక్ జగదీష్ గ్రామీణ నేపథ్యంలో రూపొందింది. టీజర్ లో నాని స్టైలిష్ గా టక్ చేసుకుని అటుపై పొలంలో దిగి గొడవకి రెడీ అవుతున్న వైనం ఆశ్చర్యపరిచింది. అయితే ఈ పాత్ర టక్ వెనక కారణం కూడా అంతే బలంగా ఉంది. అతడు మండల రెవెన్యూ అధికారి గా కనిపిస్తున్నాడట. పాత్రకు తగ్గట్టే టక్ వేసుకుని రోజుల తరబడి షూటింగుల్లో పాల్గొన్నాడు నాని. తన స్టైల్ ని పాత్రకు తగ్గట్టు మార్చుకున్నాడు. నాని గట్స్ ఉన్న ఎంఆర్వో గా భయంలేని వాడిగా కనిపిస్తాడని తెలిసింది.
దర్శకుడు శివ నిర్వాణ టక్ జగదీష్ పాత్రను బలమైన భావోద్వేగాలు కుటుంబ బంధాలతో రూపొందించారు. కుటుంబ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే నాని థియేట్రికల్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఉన్నా చివరికి నిర్మాతల ఒత్తిళ్లను దృష్టిలో ఉంచుకుని ఓటీటీ రిలీజ్ కి అంగీకరించారు. షైన్ స్క్రీన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.