శంకర్ సేఫ్ గేమ్ ఆడుతాడా? లేక అదే దూకుడా!
వరుస పరాజయాలు శంకర్ ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టుతున్నాయో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది.
వరుస పరాజయాలు శంకర్ ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టుతున్నాయో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. `రోబో` తర్వాత సరైన సక్సస్ ఒక్కటీ లేదు. చేసిన సినిమాలన్నీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అవ్వడం తప్ప వాటి రికవరీ కూడా తేలేని పరిస్థితులే. `ఐ,` `2.0`, `ఇండియన్ -2`, ` నాన్ బాన్` అన్నీ ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఇటీవలే డైరెక్టర్ చేసిన `గేమ్ ఛేంజర్` కూడా బోల్తా కొట్టింది.
మరి ఇలా జరుగుతందని ఆయన ఊహించాడా? లేదా? అన్నది తెలియదు కానీ ఇన్నోవేషిన్ లేని స్టోరీతో ప్రేక్షకుల ముందు అబాసుపాలుకాక తప్పలేదు. అయితే ఈ సినిమాలన్నీ శంకర్ ఎంతో కాన్పిడెంట్ తో ఎక్కడా రాజీ పడకుం డా చేసిన చిత్రాలు. సాధారణంగా శంకర్ తన సొంత కథలతో వస్తారు. బయట రచయితులున్నా? దానికి మెరుగులు దిద్దేది శంకర్. కానీ `గేమ్ ఛేంజర్` విషయలో మాత్రం స్టోరీ పరంగా శంకర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వచ్చే సారు.
కార్తీక్ సుబ్బరాజ్ రాసిన కథని నమ్మి నమ్మకంతో బరిలోకి దిగే సరికి ఫలితం నీరు గార్చేసింది. ఈ నేపథ్యంలో శంకర్ కి తదుపరి స్టార్ హీరోలు అవకాశం ఇవ్వడం కూడా కష్టమే అవుతుంది. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చిన ప్పుడే? ఇంత కాలం లేని ప్రేమ ఇప్పుడే ఎందుకిలా తెలుగు సినిమాపై అనే చిన్న విమర్శ వినిపించింది. అక్కడ ఛాన్సులు రాకపోవడంతోనే ఇక్కడికి వచ్చారా? అన్న అనుమానం కలిగింది.
అదంతా పక్కన బెడితే శంకర్ మాత్రం ఇంకపై సేఫ్ గేమ్ ఆడాల్సిన టైమ్ వచ్చింది. తాను పట్టిన కుందేలు కు మూడే కాళ్లు అనే మొండి వైఖరిని వదిలేసి నవతరం రచయితలతో కలిసి ముందుకెళ్లాలి? లేదా? సుజాత రంగ రాజన్ లాంటి మరో దిగ్గర రైటర్ ని పట్టుకోగలగాలి. అప్పుడే శంకర్ మళ్లీ ఫాం లోకి వచ్చేదంటూ కోలీవుడ్ లో ప్రచారం మొదలైంది. శంకర్ సినిమాల్లో ఎమోషన్ మిస్ అవుతుందని చాలా కాలంగా వినిపిస్తుంది. తదుపరి చిత్రాల విషయంలో ఆ విమర్శకు తావు ఇవ్వకూడదు. ప్రస్తుతం శంకర్ చేతుల్లో `ఇండియన్ -3` ఉంది. తానే ఏంటి? అన్నది ఈ సినిమాతో నిరూపించుకోవాల్సి ఉంది.