మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే 2007లో చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. తన రెండో సినిమా మగధీరతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. చివరగా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి మెప్పించాడు. ఈ సినిమా ద్వారా అనేక రికార్డులు క్రియేట్ చేసి అవార్డులను సొంతం చేసుకుంటున్నాడు. అయితే తాజాగా ఆస్కార్ వేడుకల కోసం ఆయన తన సతీణితో కలిసి అమెరికాకు వెళ్లాడు.
ఈ క్రమంలోనే గర్భిణీగా ఉన్న తన భార్యతో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ట్రిప్ వీడియోను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ అభిమానులతో షేర్ చేసుకుంది. అందులో ఇద్దరూ కలిసి షాపింగ్, డిన్నర్, సైట్ సీయింగ్ చేస్తూ అమెరికా వీధుల్లో అల్లరి చేశారు. అయితే చరణ్ ఓపెన్ టాప్ కారును స్వయంగా డ్రైవ్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అయితే వీడియో చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా చెర్రీకి యూఎస్ లో డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అని ఆరా తీస్తున్నారు.
ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పెట్టడం కోసమే కారు నడిపాడా... లేదా నిజంగానే లైసెన్స్ ఉందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ చెర్రీకి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే అది క్రైమ్ కిందకు వస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉంటున్న తెలుగు ప్రజలు దీనిపై ఎక్కువగా చర్చించుకుంటున్నారు. దీనిపై చెర్రీ లేదా ఉపాసన స్పందిస్తే తప్ప అసలు విషయం తెలియదు.
మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఐదు హాలీవుడ్ క్రిటిక్స్ చాయిస్ అవార్డులను గెలుచుకుని రికార్డు క్రియేట్ చేసింది. అలాగే ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును సాధించింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేట్ అయిన విషయం అందరికీ తెలిసింది. ఈ క్రమంలోనే చెర్రీ అమెరికాకు వెళ్లగా.. కచ్చితంగా అవార్డు చేతపట్టుకొని వస్తాడని అంతా భావిస్తున్నారు. మరి చూడాలి ఆస్కార్ లో ఈ పాటకు అవార్డు దక్కుతుందో లేదో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

For Video >>> https://youtube.com/shorts/5PpeNRJ6Bpo?feature=share