వాళ్లంతా రిజెక్ట్ చేసిన తర్వాతే నా దగ్గరకొచ్చాడు!
ఆ సమయంలోనే ఆశీర్వాద్ సినిమాస్ కి చెందిన అంటోనీ పెరుబపూర్ మోహన్ లాల్ కి ఫోన్ చేసి జోసెఫ్ దగ్గర మంచి స్టోరీ ఉందని చెప్పారుట. వీలుంటే విను అని సలహా ఇచ్చారుట.
కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'దృశ్యం' ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. సౌత్ లో అన్ని భాషల్లోనూ ఆసినిమా రీమేక్ అయింది. తెలుగులో విక్టరీ వెంకటేష్ నటిం చారు. ఇక్కడా మంచి విజయం సాధించింది. ఇప్పటికే 'దృశ్యం' నుంచి రెండు భాగాలు రిలీజ్ అయ్యాయి. తాజాగా 'దృశ్యం-3'కి రంగం సిద్దమవుతోంది. స్క్రిప్ట్ పనులు పూర్తయ్యయి. యదావిధిగా మూడవ భాగంలో మోహన్ లాల్ హీరోగా నటిస్తున్నారు.
రెండు భాగాల్ని మించి మూడవ భాగం మరింత సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. అయితే 'దృశ్యం' కథని చాలా మంది హీరోలు రిజెక్ట్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కథ సిద్దమైన తర్వాత జీతూ జోసెప్ నేరుగా మోహన్ లాల్ దగ్గరకొచ్చి వినిపించలేదు. అంతకు ముందు కొంతమంది హీరోలకు నేరెట్ చేసాడుట. స్టోరీ సిద్దమైన తర్వాత దాదాపు ఐదేళ్ల పాటు హీరోలు చుట్టూ ఒప్పించడానికే తిరగాడుట.
కానీ వివిధ కారణాలతో ఆ కథని రిజెక్ట్ చేసారుట. ఆ సమయంలోనే ఆశీర్వాద్ సినిమాస్ కి చెందిన అంటోనీ పెరుబపూర్ మోహన్ లాల్ కి ఫోన్ చేసి జోసెఫ్ దగ్గర మంచి స్టోరీ ఉందని చెప్పారుట. వీలుంటే విను అని సలహా ఇచ్చారుట. కథ విన్న వెంటనే లాల్ ఒప్పుకున్నట్లు తెలిపారు. అలాగే సినిమా హిట్ వెనుక ఉన్న సీక్రెట్ ని రివీల్ చేసారు. సినిమాలో ముఖ్య ఉద్దేశాన్ని అర్దం చేసుకుని థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే ఫీలింగ్ ప్రేక్షకుడిలో ఉంటే ఆ సినిమా హిట్ అవుతుందని కచ్చితంగా చెప్పొచ్చని మోహన్ లాల్ అంటున్నారు.
హీరోకు తన కుటుంబపై ఉన్న ప్రేమను ప్రేక్షకులు అర్దం చేసుకున్నారు కాబట్టే అంత పెద్ద సక్సెస్ అయిం దన్నారు. 'దృశ్యం -3' వచ్చే ఏడాది మొదలవుతుంది. అయితే ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ఈ కథని మరో హీరో రీమేక్ చేయడానికి అవకాశం ఉండదు. తెలుగులో రెండు భాగాల్లోనూ వెంకటేష్ నటించిన సంగతి తెలిసిందే.