దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మాగ్నమ్ ఓపస్ RRR ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ సాధించింది. ఇటీవలే జపాన్ లో విడుదలైన ఈ మల్టీస్టారర్.. అక్కడ కూడా వసూళ్ల వేట ప్రారంభించింది.
"ఆర్.ఆర్.ఆర్" మూవీకి జపాన్ లో అనూహ్యమైన స్పందన లభించింది. దీనికి తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. కేవలం 17 రోజుల్లో 1,22,727 ఫుట్ ఫాల్స్ తో 185M¥ కలెక్షన్స్ తో అత్యంత వేగంగా ఈ నంబర్ ని అందుకున్న భారతీయ చిత్రంగా నిలిచింది. తొలిరోజు రూ. 1.06 కోట్లు వసూలు చేసి జపాన్ లో అతిపెద్ద ఓపెనింగ్ రాబట్టిన ఈ చిత్రం.. ఇప్పటికే ఇండియన్ కరెన్సీలో 10 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ట్రెండ్ చూస్తుంటే రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ సాధించడం ఖాయమని తెలుస్తోంది. ఈ సందర్భంగా ట్రిపుల్ ఆర్ టీమ్ ట్వీట్ చేస్తూ.. "జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద RRR రన్ ఆగలేదు. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకి ఎప్పటికప్పుడు మంచి ప్రశంసలు వస్తున్నాయి. మా చిత్రం 3వ వారాంతం (17 రోజులు) నాటికి 1,22,727 ఫుట్ ఫాల్స్ ని సాధించిందని పంచుకోవడం ఆనందంగా ఉంది" అని పేర్కొన్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'ముత్తు' సినిమా జపాన్ లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. 1998లో విడుదలైన ఈ చిత్రం 400M¥ లను అందుకుంది. అలానే 2018లో 4K వెర్షన్ ను రీ-రిలీజ్ చేయగా.. 50M¥ లను రాబట్టగలిగింది. ఓవరాల్ గా ఫైనల్ రన్ లో 450M¥ సాధించి గత కొన్నేళ్లుగా నెం.1 ప్లేస్ లో కొనసాగుతోంది. ఇక రాజమౌళి రూపొందించిన 'బాహుబలి 2: ది కన్ క్లూజన్' మూవీ అక్కడ 275 M¥ కలెక్షన్స్ తో రెండో స్థానంలో నిలిచింది.
ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన RRR సినిమా కేవలం మూడు వారాల్లో 185M¥ వసూళ్లతో మూడో స్థానంలో నిలిచింది. ట్రేడ్ ని బట్టి చూస్తే మరికొన్ని రోజుల్లోనే 'బాహుబలి 2' రికార్డును బీట్ చేస్తుందని అంచనా వేయొచ్చు. కాకపోతే 'ముత్తు' సినిమా జపాన్ రికార్డ్ ను 'ఆర్.ఆర్.ఆర్' బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లాంగ్ రన్ లో దాదాపు అదే స్థాయిలో కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
జపాన్ లో "ఆర్.ఆర్.ఆర్" సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసారు. రాజమౌళి - ఎన్టీఆర్ - రామ్ చరణ్ టోక్యో వెళ్లి మూవీ ప్రమోషన్స్ చేసారు. జపాన్ వాసులు ఈ చిత్రాన్ని ఆదరించడంతో.. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద మంచి నంబర్స్ నమోదవుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
కాగా, RRR చిత్రాన్ని ఇద్దరు విప్లవ వీరుల స్పూర్తితో అల్లుకున్న కల్పిత కథతో తెరకెక్కించారు. ఇందులో భీమ్ గా తారక్ - రామరాజుగా చరణ్ అద్భుతమైన నటన కనబర్చారు. అజయ్ దేవగన్ - అలియా భట్ - ఒలివియా మోరీస్ - శ్రేయా - సముద్రఖని తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేసారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.