నాలుగేళ్ల తర్వాత అవకాశం.. విజయం దక్కుతుందా?

Update: 2019-12-09 10:43 GMT
ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటే చాలు.. ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయని చాలామందికి ఓ అభిప్రాయం ఉంది.  కొందరి విషయంలో అది నిజమే కానీ అందరి విషయంలో అలా జరగదు. కారణాలు ఏవైనప్పటికీ కొన్ని సార్లు విజయం సాధించిన దర్శకులు కూడా తమ నెక్స్ట్ సినిమా కోసం ఏళ్ళ తరబడి వేచి చూస్తున్నారు. దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ విషయంలో కూడా ఇలానే జరిగింది.

సుశాంత్ హీరోగా నటించిన 'కరెంట్' సినిమాతో సూర్యప్రతాప్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.  ఆ సినిమా తర్వాత 'కుమారి 21 F' సినిమాకు దర్శకత్వం వహించాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా 2015 లో రిలీజ్ అయింది. ఈ సినిమా విడులైన నాలుగేళ్లకు సూర్యప్రతాప్ కొత్త సినిమా లాంచ్ అయింది.  నిఖిల్ సిద్దార్థ్ హీరోగా జీఎ2 పిక్చర్స్ నిర్మాణంలో  సూర్య ప్రతాప్ కొత్త సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అందించడమే కాకుండా సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

'కుమారి 21F' లాంటి సూపర్ హిట్ తర్వాత కూడా నెక్స్ట్ సినిమా కోసం సూర్యప్రతాప్ ఇన్నేళ్ళు వేచి చూడడం ఆశ్చర్యకరమే అయినా ఇప్పుడు సక్సెస్ఫుల్ బ్యానర్ లో సినిమా సెట్ అయింది. ఇది గోల్డెన్ ఆఫర్ అనే చెప్పాలి. మరి ఈ సినిమాతో సూర్యప్రతాప్ విజయం సాధిస్తాడా.. నిఖిల్ కు కూడా ఒక మంచి హిట్ ఇస్తాడా అనేది వేచి చూడాలి.
Tags:    

Similar News