తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన వాలిమై సినిమా భారీ అంచనాల నడుమ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు లో కూడా ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయడం జరిగింది. తమిళనాట ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి మంచి ఓపెనింగ్ వసూళ్లను దక్కించుకుంది. లాంగ్ రన్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం ఖాయం అనే నమ్మకంతో అజిత్ అభిమానులు ఉన్నారు.
సినిమా విడుదల అయ్యి బాగుంది అనే టాక్ ను దక్కించుకుని దూసుకు పోతున్న అజిత్ సినిమా వాలిమై కి కాపీ మరక అంటింది. ఈమద్య కాలంలో ప్రతి ఒక్క సినిమా ను కూడా ఏదో ఒక సినిమా కు కాపీ అని లేదంటే ఇన్సిపిరేషన్ అంటూ ప్రచారం మొదలు అయ్యింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు ఇలాంటి అపవాదును మూట కట్టుకోవాల్సి వస్తుంది. తాజాగా అజిత్ నటించిన వాలిమై సినిమాకు కూడా ఆ అపవాదు తప్పలేదు.
జాకీ చాన్ నటించిన ఒక యాక్షన్ త్రిల్లర్ కు ఈ సినిమా కాపీ అనే ప్రచారం మొదలైంది. ఆ సినిమా లో జాకీ చాన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. ఆ సినిమాలో ఎలా అయితే విలన్స్ కోసం పోలీస్ గా హీరో పోరాటాలు చేస్తాడో అచ్చు వాలిమై లో కూడా అజిత్ పోలీసుగా పోరాటాలు చేశాడంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. దర్శకుడు వినోద్ ను ప్రతిభా వంతుడు అని అనుకుంటూ ఉంటే ఇలా కాపీ సినిమాను తీసుకు వచ్చాడేంట్రా బాబు అంటూ కొందరు మీమ్స్ చేయడం మొదలు పెట్టారు.
ఈ సమయంలో అజిత్ అభిమానులు వాలిమై పై జరుగుతున్న తప్పుడు ప్రచారంను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు యాంటీ ఫ్యాన్స్ ఆ ప్రచారం ను మరింత పెంచేందుకు చూస్తున్న ఈ సమయంలో అజిత్ ఫ్యాన్స్ రంగంలోకి దిగి వాటిని కొట్టి పారేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అజిత్ వాలిమై సినిమా లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. పోలీస్ స్టోరీస్ ఎక్కువ శాతం కొన్ని సన్నివేశాలు సేమ్ గా అనిపిస్తాయి.
పోలీసులు రౌడీ లను చేజింగ్ చేసే సన్నివేశాలు ప్రతి సినిమా లో ఉంటాయి. అంత మాత్రాన ప్రతి సినిమా ను కూడా కాపీ అంటారా అంటూ అజిత్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. జాకీ చాన్ సినిమా ది న్యూ పోలీస్ స్టోరీ మొత్తం చూస్తే అప్పుడు వాలిమై కి ఆ సినిమా కు ఎంత తేడా ఉంటుందో అర్థం అవుతుంది.
కొందరు కేవలం ట్రైలర్ ను మాత్రమే చూపిస్తూ కాపీ మరక అంటించే ప్రయత్నాలు చేస్తున్నారని అజిత్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాపీ వివాదంపై దర్శకుడు వినోద్ లేదా వాలిమై చిత్ర యూనిట్ సభ్యుల్లో ఎవరో ఒకరు స్పందిస్తే బాగుంటుందని అభిమానులు అంటున్నారు.