వరుసగా ఒకటికి మూడు రీమేక్ సినిమాలు చేసేటప్పటికి కిషోర్ కుమార్ పార్థసాని (డాలీ)కి మొహం మొత్తేసినట్లుంది. ఇకపై తాను రీమేక్ సినిమాలే చేయనంటున్నాడతను. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ లాంటి మ్యూజికల్ లవ్ స్టోరీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు డాలీ. ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోయినా డాలీ అభిరుచి ఉన్న దర్శకుడిగానే గుర్తింపు తెచ్చుకున్నాడు.
కానీ రెండో సినిమాగా రీమేక్ మూవీ చేయడం అతడి కెరీర్ ను కొత్త బాట పట్టించింది. ‘తడాఖా’ బాగానే ఆడటంతో వరుసగా ఇంకో రెండు రీమేక్ చిత్రాలు చేశాడు. అవే.. గోపాల గోపాల.. కాటమరాయుడు. ఈ సినిమాలు ఎలాంటి ఫలితాన్నందుకున్నాయన్నది పక్కన పెడితే.. దర్శకుడిగా డాలీకైతే పెద్దగా గుర్తింపైతే రాలేదు. ఈ నేపథ్యంలోనే ఇకపై రీమేక్ సినిమాలు చేయనన్న స్టేట్మెంట్ ఇచ్చాడు డాలీ. తాను చేసిన రీమేక్ సినిమాల్ని మక్కీకి మక్కీ ఏమీ దించేయలేదని.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేశానని.. ‘కాటమరాయుడు’లో కూడా ప్రథమార్ధం అంతా మార్చేయడం గమనించవచ్చని అన్నాడు.
ఏదేమైనప్పటికీ వరుసగా మూడు రీమేక్ చిత్రాలు చేసిన నేపథ్యంలో ఈసారి స్ట్రెయిట్ మూవీ చేయాలని భావిస్తున్నట్లు డాలీ తెలిపాడు. పవన్ కళ్యాణ్ తో చేసిన రెండు సినిమాలూ రీమేకులే అని.. ఆయనతో ఓ స్ట్రెయిట్ మూవీ చేయాలనుందని కూడా డాలీ చెప్పాడు. మరి డాలీ నుంచి రాబోయే స్ట్రెయిట్ మూవీ ఎలా ఉంటుందో.. అతడికి పవన్ స్ట్రెయిట్ మూవీ ఛాన్సిస్తాడో లేదో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/