తూర్పు కనుమలు.. పశ్చిమ కనుమలు.. అంటూ సోషల్ స్టడీస్ పాఠ్యాంశాలు చదువుకున్నాం. అయితే ఈ రెండు చోట్లలో పశ్చిమ కనుమల్లోనే డైరెక్టర్ సుకుమార్ కి శేషాద్రి అడవుల మ్యాప్ కనిపించిందా? తూర్పు కనుమల్లో ఎక్కడా కనిపించలేదా? అలా ఎందుకని..? అంటే డైరెక్టర్ వ్యూ ఆఫ్ పాయింట్ గురించి తెలుసుకోవాలి. అయితే అతడు పుష్ప సినిమాని సెట్స్ వేయకుండా తెరకెక్కించడానికి ఏపీలో ఎక్కడా అడవులే కనిపించలేదా? అన్న సందేహం కలుగుతోంది.
తూర్పు కనుమలు భారత ద్వీపకల్పపు తూర్పు సముద్ర తీరం వెంట ఉండే కొండల వరుస. ఉత్తర ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణాన తమిళనాడు వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. ఇవి కర్ణాటక.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల గుండా కూడా పోతాయి. ద్వీపకల్ప భారతదేశంలోని నాలుగు ప్రధాన నదులు - గోదావరి, మహానది, కృష్ణ, కావేరి - తూర్పు కనుమలను ఒరుసుకుంటూ.. కోసుకుంటూ, ఖండిస్తూ ప్రవహించి.. బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇలా దట్టమైన అడవులు ఉన్న లొకేషన్లు.. నదీ పరీవాహక ప్రదేశాల్లో షూటింగ్ కి అనుకూలం కాదా? అన్నది సుకుమార్ నే చెప్పాల్సి ఉంటుంది.
పడమటి కనుమలు భారత ద్వీపకల్పపు పశ్చిమ తీరానికి సమాంతరంగా.. కేరళ.. తమిళనాడు.. కర్ణాటక.. గోవా.. మహారాష్ట్ర.. గుజరాత్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న పర్వత శ్రేణి. సుక్కూ కి కేరళ అడవులు మాత్రమే కనిపించాయి. అందుకే అక్కడ పుష్ప సినిమాని చిత్రీకరించాలని అనుకున్నా.. మహమ్మారీ కారణంగా చేయలేకపోయాడు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు షూటింగులకు అనుమతులు ఇచ్చేశాయి కాబట్టి పుష్ప చిత్రీకరణ కోసం సుక్కూ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. శేషాద్రి - తిరుమల అడవుల్లో షూటింగులకు అనుమతులు లేవు. అలాగని పొరుగు రాష్ట్రాల్లో షూటింగ్స్ నిర్వహించే అవకాశం లేదు కాబట్టి తన సినిమాని దాదాపు సెట్స్ తో మేనేజ్ చేయాలని చూస్తున్నాడట. ఆర్.ఆర్.ఆర్ తరహాలోనే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న పుష్ప మూవీ కోసం భారీ సెట్స్ నిర్మించనున్నారని తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ అంటే దట్టమైన అడవులు అయితేనే బావుంటుంది. సుక్కూకి ఎంతో పరిచయం ఉన్న తూర్పు కనుమల్లో ఎక్కడా సరైన అడవి కనిపించకపోవడం ఆశ్చర్యకరమే.
విశాఖ మన్యం- అరకు సహా ఇటు నర్సీపట్నం- కేడీపేట ఏరియాలో ఎంతో దట్టమైన అడవులు కొండలు ఉన్నా కానీ అవేవీ పుష్ప షూటింగ్ కోసం అనుకూలం కాదని భావించాల్సి ఉంటుంది. మరి సుక్కూ అటువైపు చూసి వదిలేశాడా? చూడకుండానే వదిలేశాడా? అన్నది తెలియాలి. సెట్స్ లో తొలిగా పూర్తి చేయాల్సిన వాటిలో పాటలు కొన్ని సన్నివేశాలు ఉంటాయిట. మరి అడవిలో షూటింగ్ పై ఇంకా ఆలోచిస్తున్నాడా? అన్నది కాస్త ఆగితే కానీ తెలీదు.