దశాబ్ధాల పాటు అగ్ర సంగీత దర్శకులుగా చక్రం తిప్పుతున్నారు దేవీశ్రీ ప్రసాద్- ఎస్.ఎస్.థమన్. ఈ ఇద్దరికీ వేరే ఆల్టర్నేట్ అన్నదే లేదు! అన్నంతగా ఆ ఇద్దరూ టాలీవుడ్ లో పాగా వేశారు. దేవీశ్రీ ఆల్ రౌండర్ నైపుణ్యంతో అన్ని భాషలను చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు -తమిళంలో థమన్ హవా సాగిస్తున్నాడు. అయితే తమిళ చిత్రపరిశ్రమలో ఈ ఇద్దరికీ ఠఫ్ కాంపిటీషన్ ఉంది. అక్కడ ఉద్ధండులైన సంగీత దర్శకులు ఉన్నారు. ఏ.ఆర్.రెహమాన్- హ్యారిస్ జైరాజ్- యువన్ శంకర్ రాజా- అనిరుధ్ రవిచంద్రన్- డి.ఇమామ్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అక్కడ పరిశ్రమను డామినేట్ చేస్తున్నారు.
కానీ తెలుగు వరకూ వస్తే దేవీశ్రీ- థమన్ ఇద్దరిదే హవా. వీళ్లకు రీప్లేస్ మెంట్ అన్నదే లేదు. మన స్టార్ డైరెక్టర్లు.. స్టార్ హీరోలు ప్రస్తుతానికి ఈ ఇద్దరిపైనే డిపెండ్ అయ్యారన్నది సుస్పష్టం. ఇక ఇతర సంగీత దర్శకుల్లో ఇళయరాజా- కీరవాణి వంటి సీనియర్స్ కి ఎప్పుడూ అవకాశాలున్నాయి. ఇటీవల మణిశర్మ- కోటి వంటి సీనియర్ల హవా తగ్గింది. వారి కెరీర్ నెమ్మదిగా ముందుకు సాగుతోంది.
అలాగే ఎం.ఎం కీరవాణి వారసుడు యువకెరటం కాల భైరవ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సత్తా చాటుతూ వేగంగానే దూసుకొస్తున్నాడు. అతడి సంగీతంలో యూనిక్ నెస్ యువతరానికి కనెక్టవుతోంది. బహుశా అతడు మునుముందు పెద్ద సంగీత దర్శకుడి హోదాకు చేరుకుంటాడని విశ్లేషణలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఇంకా తెలుగు చిత్రసీమలో అద్భుత ప్రతిభావంతులైన సంగీత దర్శకులున్నా వీళ్ల పేర్లేవీ అంతగా వెలుగులోకి రావడం లేదు. దానికి మరికొంత సమయం పట్టొచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలందరికీ ఉన్న ఆప్షన్ దేవీశ్రీ- థమన్ మాత్రమే. కానీ ఆ ఇద్దరికీ రీప్లేస్ మెంట్ గా ఇంకా ఎవరు రేసులో చేరుతున్నారు? అన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.
చరణ్ కోసం మళ్లీ దేవీశ్రీనే..!
తాజా సమాచారం మేరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ మూవీ నేడు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? అంటూ చర్చ సాగుతోంది. ఇంతలోనే దేవీశ్రీ పేరు తెరపైకి వచ్చేసింది. ఉప్పెన చిత్రానికి సెన్సేషనల్ ట్రాక్స్ ను కంపోజ్ చేసిన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ నే బుచ్చిబాబు మళ్లీ ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ చిత్రీకరణ 2023 జనవరిలో ప్రారంభమవుతుంది. మరోవైపు చరణ్ నటిస్తున్న ఆర్.సి 15 చిత్రం 2023లో విడుదల కానుంది. శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.