తమిళ సినీ ప్రేక్షకులు - ముఖ్యంగా అభిమానులు తలైవా అంటూ ఆరాధనగా పిలుచుకునే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్... తన అభిమానులకు ఓ చక్కటి సలహా ఇచ్చారు. తన రాజకీయ రంగ ప్రవేశంపై అభిమానుల సలహాలు - సూచనలు తీసుకునేందుకు ఫ్యాన్స్ తో ఫొటో సెషన్స్ ను మలి విడతగా ప్రారంభించిన రజనీ... ఇప్పటికే మూడు రోజుల సెషన్స్ ను పూర్తి చేశారు. మరో మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ సెషన్స్ తర్వాత ఈ నెల 31న రజనీ... తన రాజకీయ రంగ ప్రవేశంపై ఓ సంచలన ప్రకటన చేయనున్నారు. ఈ సందర్భంగా మూడో రోజు సెషన్స్ సందర్భంగా రజనీ... తన అభిమానులకు ఓ చక్కటి సలహా ఇచ్చారు.
అభిమానులకు జీవిత పాఠాలను బోధించేందుకు రెడీ అయిపోయిన రజనీ... ఆశీర్వాదం కోసం తన పాదాలను తాకడం ఎందుకంటూ ప్రశ్నించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలను ముద్దాడి ఆశీర్వాదం తీసుకోవాలని ఆయన సూచించారు. అదే సమయంలో ఎవరో ముక్కూ మోహం తెలియని సంపన్నుల పాదాలను కూడా తాకడం మానేయాలని కూడా ఆయన అభిమానులకు సూచించారు. ఈ సందర్భంగా అభిమానులతో ఆయన ఏమన్నారన్న విషయానికి వస్తే.. *నా నుంచి ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటే... నా పాదాలను తాకొద్దు. ఆశీర్వాదం కావాలంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలను ముద్దాడండి. అంతేకాకుండా డబ్బు - అధికారం - పాపులారిటీ ఉన్న ఇతరుల ముందు సాగిలపడటం కూడా మానేయండి* అని రజనీ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యల ద్వారా తన సింప్లిసిటీని అభిమానులకు మరోమారు గుర్తు చేసిన రజనీ... అసలు జీవిత సత్యాన్ని వారికి బోధించారని చెప్పాలి. ఇదిలా ఉంటే.. అభిమానులకు పసందైన నాన్ వెజ్ విందును కూడా త్వరలోనే ఇవ్వనున్నట్లు రజనీ ఓ భారీ ప్రకటన చేశారు. ప్రస్తుతం సెషన్స్ జరుగుతున్న రాఘవేంద్ర మఠంలో నాన్ వెజ్ వంటకాలు నిషిద్ధమని, అయితే అభిమానులకు నోరూరించే మాంసాహారంతో కూడిన భారీ విందును త్వరలోనే ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా ఈ నెల 31న తన రాజకీయ రంగ ప్రవేశం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తను వినిపించనున్నట్లుగా రజనీ ఈ మాట చెప్పారన్న వాదన వినిపిస్తోంది.