అర్జున్ రెడ్డి రీమేకులు.. ఓ అరుదైన రికార్డు!

Update: 2019-02-19 10:08 GMT
సందీప్ వంగా - విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండను క్రేజీ హీరోగా మార్చిన చిత్రమది.  'అర్జున్ రెడ్డి' సినిమాను హిందీ.. తమిళ భాషలలో రీమేక్ చేస్తున్నారు.  అవుట్ పుట్ నచ్చలేదని తమిళంలో రీమేక్ ను ఈమధ్య నిర్మాతలు స్క్రాప్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా కొత్త టీమ్ తో మొదలు పెడుతున్నారు.

ఈ సినిమాకు బాలా స్థానంలో 'అర్జున్ రెడ్డి' సినిమాకు సందీప్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన గిరీశయ్యను దర్శకుడిగా ఎంచుకున్నారనే టాక్ వినిపిస్తోంది.   గిరీశయ్యకు పెద్దగా అనుభవం లేదు కాబట్టి సీనియర్ సినిమాటోగ్రాఫర్ అయితే దర్శకుడికి సహాయంగా ఉంటుందని రవి కే. చంద్రన్ ను ఎంచుకున్నారట.  ఒకవేళ నిజంగానే రవి కే. చంద్రన్ కనుక ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా తీసుకుంటే ఇదో రికార్డు అవుతుంది. ఎందుకంటే 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' కు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న సంతాన కృష్ణన్ ఎవరో కాదు.  ఆయన రవి కే. చంద్రన్ తనయుడే.

అంటే 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ కు తండ్రి సినిమాటోగ్రాఫర్ అయితే.. హిందీ రీమేక్ కు తనయుడు సినిమాటోగ్రాఫర్ అన్నమాట. ఇలాంటి అరుదైన సందర్భం సినీ చరిత్రలో ఇంతవరకూ వచ్చి ఉండదు.  తండ్రీ కొడుకులు సాధించనున్న ప్రత్యేకమైన రికార్డు ఇది. మరి రీమేక్ సినిమాలలో వారి అవుట్ పుట్ విషయంలో పోలికలు వస్తాయేమో వేచి చూడాలి.
Tags:    

Similar News