విజయ్ సినిమాలో డబుల్ బొనాంజా

Update: 2019-06-04 05:34 GMT
తెలుగులో పెద్ద మార్కెట్ లేదు కానీ తమిళ్ లో విజయ్ కున్న ఫాలోయింగ్ మాములుది కాదు. యావరేజ్ మసాలా సినిమాలతో సైతం రెండు వందల కోట్లు రాబట్టగలిగే స్థాయి అతనిది. రజనీకాంత్ తర్వాత ప్లేస్ ఇతనిధే అంటూ ఫ్యాన్స్ తరచు ప్రచారం చేస్తూ ఇదే విషయంగా అజిత్ అభిమానులతో గొడవలు పడటం అక్కడ సర్వసాధారణ విషయం. ఇదిలా ఉండగా విజయ్ కొత్త సినిమా రాజారాణి ఫేమ్ అట్లీతో చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే కీలక భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం. దీని మీద ఇప్పటికే అక్కడ భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ విజయ్ తో తీసిన తేరి-మెర్సల్(తెలుగు అదిరింది) రెండూ బ్లాక్ బస్టర్స్ కావడంతో హ్యాట్రిక్ మూవీగా ఇది వాటిని మించుతుందనే లెక్కలో ట్రేడ్ భారీ పెట్టుబడులు పెడుతోంది

ఇదిలా ఉండగా దీనికి సంబంధించిన మరో న్యూస్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తోంది. దాని ప్రకారం విజయ్ ఇందులో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. నయన్ జంటగా కనిపించేది కొడుకు పాత్రతో. విజయ్ మెర్సల్ లో ట్రిపుల్ రోల్ చేశాడు. ఇప్పుడిది మరోసారి కాకపోతే ఓ పాత్ర తగ్గింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఫుట్ బాల్ కోచ్ గా విభిన్న పాత్రను పోషిస్తున్న విజయ్ ప్రస్తుతం తండ్రి తాలూకు పాత్ర చిత్రీకరణలో ఉన్నాడు.

దీపావళికి టార్గెట్ చేసిన ఈ మూవీ తెలుగులో కూడా సమాంతరంగా రిలీజ్ కానుంది. టైటిల్ ఫిక్స్ చేశాక అనౌన్స్ మెంట్ ఇస్తారు. జాకీ శ్రోఫ్ మెయిన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా 2019లో కోలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీస్ లో ఒకటిగా ఉంది. షారుఖ్ ఖాన్ చిన్న క్యామియో కనిపిస్తాడనే టాక్ ఉంది కాని యూనిట్ ఇంకా దాన్ని ఖరారు చేయడం లేదు


Tags:    

Similar News