20 రోజుల్లోనే RC ఫ్యాన్స్ కి డ‌బుల్ ధ‌మాకా

Update: 2022-03-27 09:33 GMT
కేవ‌లం 20 రోజుల్లోనే RC ఫ్యాన్స్ కి డ‌బుల్ ధ‌మాకా ట్రీట్ అంద‌నుంది. ఓవైపు ఆర్.ఆర్.ఆర్ సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తుంటే ఇంత‌లోనే ఆచార్య‌లో అత‌డిని చూసేందుకు ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు.

ఇక రెండు సినిమాల్లోనూ చ‌ర‌ణ్ లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌ల‌తో మెస్మ‌రైజ్ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. ఇక‌పోతే ఈ సోమ‌వారం నుంచి జ‌నం RRR మానియా నుంచి బ‌య‌ట‌ప‌డ‌తార‌ని అంతా అంచ‌నా వేస్తున్నారు. లేదా క‌నీసం ఒక వారం పాటు ఆర్.ఆర్.ఆర్ మానియా థియేట‌ర్ల ముందు ఉంటుంద‌ని భావిస్తున్నారు.

ఇంత‌లోనే ఏప్రిల్ 28న ఆచార్య సినిమా విడుద‌ల‌వుతుంది. ఆర్సీ ఫ్యాన్స్ ని ఇది ఎగ్జ‌యిట్ చేస్తోంది. ఇక ఆచార్య‌లో చ‌ర‌ణ్ గ‌న్ చేత‌పట్టి న‌క్స‌ల్ గెట‌ప్ లో క‌నిపిస్తుండ‌డం చూస్తుంటే అందులోనూ యాక్ష‌న్ మ‌రో లెవ‌ల్లో ఉంటుంద‌ని అంచ‌నాకి వ‌చ్చేశారు ఇప్ప‌టికే. అలాగే పూజా హెగ్డేతో చ‌ర‌ణ్ రొమాన్స్ మ‌రో ట్రీట్. కేవం 20 రోజుల్లోనే రెండు విభిన్న‌మైన పాత్ర‌ల‌తో అత‌డు ట్రీటివ్వ‌నున్నాడు.

ప‌వ‌న్ బాబాయ్ బాట‌లో చెర్రీ

ఇక రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌లి కాలంలో యాటిట్యూడ్ ప‌రంగా మ‌న‌సులు దోచేస్తున్నాడు. అత‌డు కూడా బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ర‌హాలోనే సింపుల్ స్మైల్ తో డౌన్ టు ఎర్తు నేచుర్ తో అంద‌రివాడ‌య్యాడు. చిరు నుంచి ప‌వ‌న్ కి ఆ ఇద్ద‌రి నుంచి చెర్రీకి అబ్బిన గుణం ఇది. ఇక మెగా ఫ్యాన్స్ ఈ విష‌యంలో ఎప్పుడూ గ‌ర్వంగా ఉంటారు.

అన్నివేళ‌లా న‌వ్వుతూ క‌నిపించ‌డం సైలెంట్ గా కామ్ గా త‌న ప‌ని తాను చేసుకుపోవ‌డం చ‌ర‌ణ్ ప్ర‌త్యేక‌త‌. మెగా ఫ్యామిలీ హీరోలంతా ఇంచుమించు ఇదే బాణీని అనుస‌రిస్తార‌న్న‌ది ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌ని లేదు. స్టార్ డ‌మ్ గురించి ప్ర‌స్థావించేందుకు ఎవ‌రూ అంత‌గా ఆస‌క్తిగా ఉండ‌రు. ప్ర‌తి సినిమాని మొద‌టి సినిమాగా భావించి శ్ర‌మించ‌డం స‌ద‌రు హీరోల్లో అంద‌రూ చూస్తున్నారు.
Tags:    

Similar News