విజయ్ చివరి సినిమా.. ఓ టెన్షన్ అయితే ఉంది
తలపతి విజయ్ తన 69వ సినిమా అనంతరం సినీ జీవితానికి ముగింపు పలుకబోతున్న విషయం తెలిసిందే.
తలపతి విజయ్ తన 69వ సినిమా అనంతరం సినీ జీవితానికి ముగింపు పలుకబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. అందుకే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ పరంగా అభిమానులను కొంత నిరాశకు గురి చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తలపతి విజయ్ 69వ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించనున్నారు.
ఇక ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది, మరియు సంగీతం అనిరుద్ రవిచందర్ అందిస్తున్నారు. అనిరుద్ సంగీతంలో గతంలో విజయ్ సినిమాలు ఎన్నో హిట్టయ్యాయి, అందువల్ల ఈ సినిమా మ్యూజిక్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా స్టార్ట్ అవ్వకముందే ఆడియో రైట్స్ కోసం పోటీ ఎక్కువైనట్లు తెలుస్తోంది.
ఫైనల్ గా సినిమా షూటింగ్ అక్టోబర్ 5న పూజా కార్యక్రమంతో ప్రారంభం కానుంది. చిత్ర యూనిట్ ఈ సినిమా షూటింగ్‌ను భారీగా ఓపెనింగ్ సాంగ్‌తో మొదలు పెట్టాలని ప్లాన్ చేసింది. ప్రస్తుతం ప్రొడక్షన్ హౌస్ చిత్రంలో ప్రధాన పాత్రధారులను ఒక్కొక్కరుగా ప్రకటించడం ప్రారంభించింది. బాబీ డియోల్, ప్రేమలు ఫేమ్ మమితా బైజు, మరియు పూజా హెగ్డే ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. అయితే ఈ కాస్ట్ ప్రకటన కొంతమందిని నిరాశకు గురిచేసింది.
పూజా హెగ్డే మరియు విజయ్ గతంలో ‘బీస్ట్’ సినిమాలో కలిసి నటించారు, కానీ ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. మరోవైపు, హెచ్. వినోద్ గతంలో అజిత్ కుమార్ తో తీసిన ‘వలిమై’ మరియు ‘తునివు’ సినిమాలు కూడా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. ఈ కారణంగా, ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. అయితే, విజయ్ చివరి సినిమా కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటారని అభిమానులలో ఒక నమ్మకం అయితే ఉంది.
ఇక ఈ సినిమా నెవ్వర్ బిఫోర్ అనేలా విజయాన్ని సాధించాలని, విజయ్ తన నటనకు ఒక ఘనమైన ముగింపు ఇవ్వాలని మేకర్స్ కోరుకుంటున్నారు. ఇంకా సినిమా కథా నేపథ్యం పట్ల పెద్దగా క్లారిటీ రాకపోయినా, ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ గా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. మరి అనిరుద్ సంగీతం, హెచ్. వినోద్ డైరెక్షన్, విజయ్ నటనతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలా నిలుస్తుందో చూడాలి.