రజినీకాంత్ వేట్టయన్ ట్రైలర్.. ఎలా ఉందంటే?

సోషల్ డ్రామా జోనర్ లో సినిమాలు తీయడంలో జ్ఞానవేల్ దిట్ట కావడంతో.. వేట్టయన్ మూవీపై ఆడియన్స్ తో పాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Update: 2024-10-02 12:40 GMT

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వేట్టయన్- ద హంటర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. జై భీమ్ ఫేమ్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్ పై సుభాస్కర్ నిర్మిస్తున్నారు. సోషల్ డ్రామా జోనర్ లో సినిమాలు తీయడంలో జ్ఞానవేల్ దిట్ట కావడంతో.. వేట్టయన్ మూవీపై ఆడియన్స్ తో పాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో దసరా సందర్భంగా అక్టోబ‌ర్ 10వ తేదీన వేట్టయన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అదే జోష్ తో నేడు సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హంటర్ వాంతర్ చూడు డా! హంటింగ్ మొదలైంది అంటూ అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం వేట్టయన్ ట్రైలర్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అందరినీ ఆకట్టుకుని అలరిస్తోంది.

ఒక్క అమ్మాయి హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ ప్రజల నినాదాలతో ట్రైలర్ ప్రారంభమైంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగుతారు. నేరస్థుడిని పట్టుకోలేకపోతారు. క్లూ కూడా కనిపెట్టలేకపోతారు. వారంలో ఎన్ కౌంటర్ జరిగిపోవాలని పోలీస్ అధికారి (రావు రమేష్) చెబుతారు. అప్పుడే ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌ గా ఎంట్రీ ఇస్తారు రజినీ కాంత్. అక్కర్లేదు సర్.. వారం రోజులు అక్కర్లేదు సర్.. మూడే మూడు రోజుల్లో డిపార్ట్మెంట్ కు మంచి పేరు వస్తుందని చెబుతారు.

ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, దూషారా విజయన్ ను పరిచయం చేశారు మేకర్స్. అయితే క్రైమ్ క్యాన్సర్ లాంటిదని.. దానిని పెరగనివ్వకూడదని రజినీ మిగతా పోలీసులతో చర్చిస్తారు. ఊరికే మాట్లాడి ప్రయోజనం లేదు. వాడిని వెంటనే లేపేద్దామంటూ టీమ్‌ ను రెడీ చేస్తారు. మరి చివరగా రజినీకాంత్ టీమ్.. హత్య కేసులో నిందితుడిని ఎన్ కౌంటర్ చేశారా లేదా అన్నది మిగతా సినిమాగా తెలుస్తోంది. అయితే ట్రైలర్.. ఆకట్టుకుంటా సినిమాపై అంచనాలు పెంచుతోంది.

ట్రైలర్ లో రజినీకాంత్ మార్క్ డైలాగ్స్, స్టైల్, యాక్షన్.. సూపర్ గా ఉన్నాయి. స్టార్ క్యాస్టింగ్ ను దింపిన మేకర్స్.. అందరికీ సరైన స్కోప్ ఉన్న రోల్స్ ఇచ్చినట్లు అర్థమవుతుంది. జ్ఞానవేల్ మార్క్ క్లియర్ గా కనిపించింది. అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మరి రజినీకాంత్ వేట్టయన్ మూవీ.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి. అయితే మీరు ట్రైలర్ ను చూశారా? లేదా?

Full View
Tags:    

Similar News