దుల్కార్-మృణాల్ ఠాకూర్- రష్మిక మందన ప్రధాన తారాగణంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా 'సీతారామం' ఆగస్ట్ 5న తెలుగు- తమిళం- మలయాళ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెసైన సంగతి తెలిసిందే. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పణలో ఈ చిత్రం హిందీలో సెప్టెంబర్ 2న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ప్రస్తుతం చిత్రబృందం హిందీ వెర్షన్ ప్రచారంలో బిజీగా ఉంది. అక్కడా పెద్ద విజయం సాధిస్తుందన్న ధీమాను కనబరుస్తోంది. ఇందుకోసం హిందీ పరిశ్రమకు సుపరిచితురాలైన అందాల కథానాయిక మృణాల్ ఠాకూర్ తనవంతు ప్రచారం చేస్తున్నారు.
ఈ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన మృణాల్ మాట్లాడుతూ..నేను దక్షిణాది సినిమాల్లో ఇంతకంటే మంచి అరంగేట్రాన్ని కోరుకోను.. నేను పొందుతున్న ప్రేమ అపురూపమైనదని ఆనందం వ్యక్తం చేసింఇ. అన్నింటికంటే ఇది అందమైన మధురమైన కథ. ఈ చిత్రం హిందీలో అనువాదమై మరింత మందికి చేరుకోబోతున్నందుకు సంతోషిస్తున్నాను. ఒక నటిగా నేను దాదాపు రెండు ప్రపంచాలలో ఉత్తమమైన రిలీజ్ లను చూస్తున్నాను. ఇది ఎంతో ఉద్వేగాన్ని కలిగిస్తోంది... అని మృణాల్ ఉబ్బితబ్బిబ్బవుతోంది.
హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా కథాంశం ఆసక్తికరం. ఈ మూవీ కథ దేశభక్తి చుట్టూ తిరుగుతుంది. ఇందులో దుల్కార్ సల్మాన్ అందమైన హంక్ ఆర్మీ ఆఫీసర్ గా నటించాడు. ఈ సినిమాలో దుల్కర్.. మృణాల్ నటనకు ప్రశంసలు అందుతున్నాయి. యుద్ధం సరిహద్దులు మతం కంటే మానవత్వమే ముఖ్యమన్న వాస్తవాన్ని హను తెరపై ఎంతో హృద్యంగా అందంగా చూపించారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా చేరువైంది.
మంచి సినిమా అక్కడా నచ్చుతుంది:తెలుగు- మలయాళం- తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మల్టీస్టారర్ మూవీ 'సీతా రామం' హిందీ ఆడియెన్ కి నచ్చుతుందా? అంటే ప్రస్తుత ఫ్లోలో ఈ సినిమా కూడా అక్కడ ఘనవిజయం సాధిస్తుందని విశ్లేషిస్తున్నారు.
ఈ చిత్రం దక్షిణ భారత మార్కెట్ ల నుచి 62.85 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. అంతర్జాతీయంగా ఇది రూ. 78 కోట్లు వసూలు చేయడం ఒక సంచలనం. హ్యాండ్సమ్ హంక్ దుల్కర్ సల్మాన్ కి ఇది కెరీర్ పరంగా రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దక్షిణాదిన అంతా శాసించిన తర్వాత ఇప్పుడు హిందీ సినిమాకు రుచి చూపించే సమయం వచ్చింది. హిందీలోనూ పెద్ద విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.