మళ్ళీ డబల్ రోల్స్ హవా పెరిగిందే!

Update: 2019-11-08 03:30 GMT
టాలీవుడ్ లో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ జోరుగా ఉంటుంది.  ఒకసారి హారర్ కామెడీలు మరోసారి బయోపిక్ ల హవా సాగుతుంది.  ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న స్టార్ హీరోల సినిమాలు గమనిస్తే డబల్ రోల్స్ ఎక్కువయ్యాయనే విషయం అర్థం అవుతుంది.  మెగాస్టార్ చిరంజీవి నుంచి మాస్ మహారాజా రవితేజ వరకూ అందరూ డబల్ రోల్స్  తో బిజీగా ఉన్నారు.

'సైరా' తర్వాత మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో #చిరు152 చేస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే విషయం ఈమధ్యే వెల్లడయింది. చిరు తన రీఎంట్రీ సినిమా 'ఖైది నెం. 150' లో కూడా డబల్ రోల్ లో కనిపించారు.  చిరు డబల్ రోల్ లో కనిపించిన చిత్రాలన్నీ దాదాపుగా సూపర్ హిట్స్ గా నిలిచాయి. మరి ఈ సినిమా కూడా మెగాస్టార్ కు మరో హిట్ గా నిలుస్తుందేమో.

ప్రభాస్ ప్రస్తుతం 'జాన్' లో నటిస్తున్నారు.  ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా ప్రభాస్ నటిస్తున్నారట.  ప్రభాస్ డబల్ రోల్ లో నటించిన 'బాహుబలి' ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు.  ఈసారి కూడా ప్రభాస్ తన ద్విపాత్రాభినయంతో మ్యాజిక్ చేస్తారేమో వేచి చూడాలి.  

నటసింహ నందమూరి బాలకృష్ణ ఇప్పటివరకూ ఎన్నో సినిమాల్లో డ్యూయల్ రోల్ లో నటించారు.  బాలయ్య ప్రస్తుతం కె యస్ రవికుమార్ దర్శకత్వంలో 'రూలర్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా.. మాఫియా డాన్ గా డబల్ యాక్షన్ చేస్తున్నారు.

మాస్ మాహారాజా రవితేజ కూడా 'విక్రమార్కుడు' లాంటి పలు సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఈమధ్య  రవితేజ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. ఈ సినిమాలో రవితేజ ప్రేక్షకులకు డబల్ ట్రీట్ ఇవ్వబోతున్నారని సమాచారం.  


Tags:    

Similar News