2015 ముగిసిపోతోంది. ఇంకో 10 రోజులే బ్యాలెన్స్ మిగులుంది. 2016లో అడుగుపెట్టేస్తున్నాం. అయితే గతాన్ని, ఈ సంవత్సరం గడిచిన కాలాన్ని మరోమారు రివైండ్ చేసుకుంటే ఈ ఏడాదిలో బోలెడన్ని వివాదాలున్నాయ్. కొన్ని మరకలున్నాయ్. కాస్త చేదుగా అనిపించినా గుర్తు చేసుకోక తప్పదు మరి.
ఈ ఏడాది లో బాహుబలి ఎంత పెద్ద విజయం సాధించిందో, ఆ మూవీలో అవంతిక రేప్ అన్న విషయం అంతే పాపులర్ అయ్యింది. ఓ జర్నలిస్టు అవంతిక రేప్ ఇంత దారుణమేంటి? పురుషాహంకారం అంటూ నిలదీసి కలకలం సృష్టించింది. అలాగే ఈ ఏడాదిలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అక్కినేని వంశం నుంచి అఖిల్ హీరోగా వెండితెరపై ఆరంగేట్రం చేశాడు. కానీ ఫలితం నెగెటివ్‌గా వచ్చింది. అక్కినేని అభిమానుల్ని ఇది ఎంతో నిరాశపరిచింది. పరాజయంతో పనిలేకుండా అఖిల్ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో రెండో సినిమా కోసం వేచి చూస్తున్నాడు. ఇక బాలయ్య లయన్ లో నటించిన రాధికా ఆప్టే పురుషాధిక్య ప్రపంచం గురించి సూటిగా నిలదీసింది. టాలీవుడ్ లో ఆడదాన్ని థర్డ్ జెండర్ లో చూస్తారు అంటూ తీవ్రంగా విమర్శించింది. ఇక్కడ ఆడాళ్లకు అస్సలు గౌరవం లేదని దుయ్యబట్టింది. ఇక అరివీర ప్రేమికులు అనుకున్న సిద్ధార్థ్-సమంత ప్రేమాయణం ఈ ఏడాదితో ఎండ్ అయ్యింది. ఈ ఇద్దరూ కలిసే ఉన్నా విడిపోయారు మరి.
అన్నింటికంటే పెద్ద షాక్.. అందాల త్రిష యంగేజ్ మెంట్ తర్వాత కూడా భంగపడింది. వరున్ మణియన్ తో పెళ్లి వరకూ వెళ్లి విఫలమైంది. ఇది అభిమానులకు బాధ కలిగించింది. డెస్టినీ వేరే విధంగా రాసి ఉంటే ఏం చేస్తాం అని త్రిష నైరాశ్యంలోకి వెళ్లిపోకుండా కెరీర్ లో స్పీడ్ పెంచి సరైన సమాధానం చెప్పింది. ఇక ఓ వేడుకలో అలీ చేసిన కామెంట్లకు హర్ట్ అయిన సుమ అతడి చెంప చెల్లుమనిపించిందనే వార్త నెట్ లో తెగ హల్ చల్ చేసింది. అలీ సారీ చెప్పాడని అన్నారు. అయితే అలీలో ఏ మార్పూ లేదు. ఎప్పటిలానే టంగ్ స్లిప్పవుతున్నాడు. కానీ అదంతా కేవలం ఫన్ కోసమే అని ఈ మాయదారి లోకం అర్థం చేసుకోలేకపోతోంది. ఇక ఏడాది ముగింపులోనే జ్యోతిలక్ష్మి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసిన పూరి జగన్నాథ్ రాంగ్ రీజన్స్ తో వార్తల్లోకొచ్చాడు. ఛార్మితో పూరీ ఎఫైర్ అంటూ మీడియా తెగ మోసేసింది. ఏదో చెయ్యబోతే ఇంకేదో అయ్యింది మరి.
ఇక చిట్టచివరిగా స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల ఫ్యామిలీలో కలతలు, భార్య పోలీస్ కేసు పెట్టడం పెద్ద స్థాయిలో చర్చకొచ్చింది. పరాజయంలో ఉన్న వైట్లకు ఇది పెద్ద జోల్ట్ లా తగిలింది. కోలుకోలేని దెబ్బ అయ్యింది. అయినా అన్నీ మరిచి తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు శ్రీను ప్రయత్నాలు ప్రారంభించాడని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కొన్ని మరకలు. మనుషులు దేవుళ్లు కాదు కాబట్టి తప్పదు మరి.