రామాయణంలో పిటకల వేట.. కోడి గ్రుడ్డు పై వెంట్రుకలు పీకుట.. అన్న ఉపమానాలుచాలానే వున్న తరుణంలో ఒక మంచి సినిమాలో లోపాలు ఎత్తి చూపడం కష్టమే. అయితే ఇంత మంచి సినిమాకు మరికాస్త అదనపు జాగ్రత్త తీసుకుంటే మరింత అందంగా మారేదన్నమాట వాస్తవం. వాటిలో మాకనిపించిన కొన్ని..
* సినిమాలో సింగీతం శ్రీనివాసరావు గారిది ఎక్కువ నిడివిగల పాత్రని ప్రచారంలో భాగంగా తెలిపారు. తీరా చూస్తే ఆయన ఒక్క సన్నివేశంలో రెండు మూడు డైలాగులకే పరిమితమయ్యారు. ఆయన్ని ఎక్కువ సేపు తెరమీద చూడాలనుకున్న వారికి నిరాశే.
* సినిమాలో ఆంగ్ల సంభాషణలు ఎక్కువే వున్నాయి. వాటికి అనుగుణంగా కింద తెలుగులో తర్జుమా చేసి వేసినా దాన్ని 'వైట్ ఫాంట్' లో వేయడం వల్ల దాదాపు ఉపయోగం శూన్యం. కొన్ని సందర్భాలలో రాసినవి బ్యాక్ గ్రౌండ్ లో కలిసిపోగా, మరికొన్ని సందర్భాలలో వేగంగా మారిపోయాయి. దీనికంటే ఈ మధ్య సినిమాలలో వాడుకుంటున్నట్టు బ్యాక్ గ్రౌండ్ లో తెలుగు వాయస్ ఓవర్ ఇచ్చుంటే బాగుండేది.
* హీరోయిన్ చనిపోయినట్టు మధ్యలోనే రివీల్ చెయ్యకుండా చివర్లో హీరో చనిపోయాక చెప్పుంటే ఎలాగో అప్పటివరకూ ఉత్తరాలు రాస్తున్నట్టు చూపించారు కాబట్టి మరింత ఫీల్ క్యారీ అయ్యుండేది