మలయాళ సూపర్ హిట్ మూవీ దృశ్యం ను తెలుగులో అదే టైటిల్ తో రీమేక్ చేసిన విషయం తెల్సిందే. తెలుగులో వెంకటేష్.. మీనాలు చేసిన దృశ్యం సూపర్ హిట్ అయ్యింది. ఇక మలయాళంలో దృశ్యం కు సీక్వెల్ గా దృశ్యం 2 ను చేశారు. మొదటి సినిమా కథను కొనసాగిస్తూ దృశ్యం 2 ను తెరకెక్కించారు. మొదటి పార్ట్ కంటే రెండవ పార్ట్ మరింత ఆసక్తికరంగా ఉందంటూ రివ్యూలు వచ్చాయి. కథలో ట్విస్ట్ మరియు అద్బుతమైన టర్నింగ్ లతో దృశ్యం 2 సాగింది. కరోనా కారణంగా దృశ్యం 2 సినిమాను థియేటర్లలో కాకుండా ఓటీటీ లో విడుదల చేయడం జరిగింది. ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి దృశ్యం 2 ను కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు తెలుగులో దృశ్యం 2 సినిమా షూటింగ్ దాదాపుగా ముగింపు దశకు వచ్చింది. అతి తక్కువ సమయంలోనే దృశ్యం 2 ను ముగింపు దశకు తీసుకు వచ్చారు.
ఒరిజినల్ వర్షన్ కు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ తెలుగు వర్షన్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ నిర్మాణ సంస్థతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ లో సురేష్ బాబు ఈ రీమేక్ ను నిర్మిస్తున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను మే లేదా జూన్ లోనే విడుదల చేయాలనుకున్నారు. కాని కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ థియేటర్లు మూత పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడపాలంటూ ఆదేశాలు వచ్చాయి. మళ్లీ ఎప్పటి వరకు థియేటర్ల వద్ద సాదారణ పరిస్థితి నెలకొంటుంది అంటే చెప్పలేని పరిస్థితి. అందుకే దృశ్యం 2 తెలుగు వర్షన్ ను కూడా ఓటీటీ లో విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అమెజాన్ ప్రైమ్ వీడియో వారు దృశ్యం 2 సినిమా కోసం భారీ ఆఫర్ ఇచ్చారట. తెలుగులో ఈమద్య కాలంలో వచ్చిన ఓటీటీ సినిమాలు మంచి టాక్ ను దక్కించుకున్నాయి. ఆ కారణంగానే దృశ్యం 2 ను అమెజాన్ వారు కొనుగోలు చేసేందుకు గాను చాలా ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. థియేటర్ల ఓపెన్ వరకు దృశ్యం 2 ను వాయిదా వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మలయాళం దృశ్యం 2 ను చాలా మంది చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కనుక దృశ్యం 2 ను వాయిదా వేస్తే సినిమా కు ఉన్న వేడి తగ్గుతుంది. ఆ కారణంగానే ఎక్కువ ఆలస్యం చేయకుండా సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు కూడా భావిస్తున్నారు. అదే కనుక నిజం అయితే దృశ్యం 2 అనుకున్న తేదీకి ఓటీటీలో వచ్చే అవకాశం ఉందంటున్నారు.