శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో భారీ ముందడుగు పడింది. ఈ కేసులో పోలీసులు విచారణ పూర్తిచేసి, నివేదికను కోర్టుకు సైతం అందించినట్టు సమాచారం. ఈ కేసులో మొత్తం 25 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఏకంగా 2,900 పేజీల చార్జ్ షీట్ ను న్యాయస్థానికి సమర్పించినట్టు సమాచారం. ఇక, ఆ చార్జ్ షీట్ ను విచారించి, కోర్టు తీర్పు చెప్పడమే మిగిలి ఉంది. ఈ వార్తలతో.. నిందితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు.. ఆ తర్వాత పలు ఇండస్ట్రీలను చుట్టుకుంది. ఈ క్రమంలో కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన చాలా మంది డ్రగ్స్ వినియోగిస్తున్నట్టుగా, పలువురు సప్లై చేస్తున్నట్టుగా గుర్తించిన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి, పలువురిని అరెస్టు కూడా చేశారు. వీరిలో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు కూడా ఉన్నారు.
అయితే.. కొంత కాలం తర్వాత ఇద్దరు మాత్రం బెయిల్ పై బయటకు వచ్చారు. మిగిలిన వారు జైల్లోనే ఉన్నారు. జైలు నుంచి బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారనే కారణంతో కోర్టు వారికి బెయిల్ ఇవ్వలేదు. కాగా.. ఈ కేసును వేగంగా దర్యాప్తు చేసిన పోలీసులు భారీ నివేదికను తయారు చేయడం విశేషం. మొత్తం 180 మంది సాక్షులను విచారించి పోలీసులు.. 2,900 పేజీల ఛార్జ్ షీట్ ను రూపొందించారని తెలుస్తోంది.
దీంతో.. త్వరలోనే ఈ కేసును న్యాయస్థానం పూర్తిస్థాయిలో విచారించే అవకాశం ఉంది. అన్నీ సక్రమంగా ఉన్నాయనుకుంటే.. తుది తీర్పు కూడా సమీప త్వరలోనే రావొచ్చు. దీంతో.. ఏం జరుగుతుందోనని నిందితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తమను దోషులుగా నిర్ధారిస్తే.. ఎన్నాళ్లు జైలు జీవితం గడపాల్సి వస్తుందోనని భయపడుతున్నారు.