స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప ది రైజ్` శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. రివ్యూలు యావరేజ్ గానే వచ్చాయి. పబ్లిక్ టాక్ అలాగే ఉంది.
ఈ మొత్తం మిక్స్ చేసి చూస్తే `పుష్ప` రిలీజ్ కి ముందు క్రియేట్ చేసిన అంచనాల్ని ఆ స్థాయిలో అందుకోలేకపోయింది అన్నది వాస్తవంగా అర్ధమవుతోంది. అయితే ఐకాన్ స్టార్ బన్నీ ఇమేజ్ తో ప్రేక్షకులు `పుష్ప` థియేటర్ వైపు తరలుతున్నారు. `పుష్ప` వన్ మ్యాన్ షోగా టాక్ రావడంతో అభిమానులు మాత్రం తగ్గదేలే అంటూ ముందుకు సాగిపోతున్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ర్టాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్లతోనే రన్నింగ్ లో ఉంది. అయితే `పుష్ప`కి ఇప్పుడు సౌండింగ్ ప్రతికూల పరిస్థితుల్ని కల్పిస్తుంది. థియేటర్లో సినిమా చూసిన ప్రేక్షకులు సౌండ్ మిక్సింగ్ పట్ల అసంతృప్తికి లోనవుతున్నారు. బీజీఎమ్ లో నాణ్యత లోపించడం.. రీసౌండ్ వంటి కొన్ని సాంకేతిక ధ్వని సమస్యలు ప్రేక్షకుడిని అసంతృప్తికి గురి చేస్తున్నాయి.
సౌండింగ్ పై ప్రత్యేకంగా కొంత మంది నెటి జనులులు తమ అభిప్రాయాల్ని తెలిపారు. `పుష్ప` చిత్రాన్ని ఇప్పుడే చూడొద్దు. ఒక వేళ చూసినా సౌండ్ మిక్సింగ్ లో లోపాల్ని సరిచేసిన తర్వాత మళ్లీ చూడండి. బీజీఎమ్ సినిమాకి మైనస్ గా మారిందని ఓ సమీక్షకుడు రాసాడు.
`దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం కోసం కొన్ని రోజులే సమయం కేటాయించినట్లున్నారు. అందుకే అవుట్ ఫుట్ కూడా అసంతృప్తిగానే ఉంది. అతను ఇంకా బాగా పనిచేసి ఉంటే బాగుండేది అని మరొకరు రాసుకొచ్చారు. మరి ఈ లోపాల్ని మేకర్స్ ముందే గమనించలేదా? లేక పెద్ద ఇబ్బంది ఉండదని లైట్ తీసుకున్నారా? అన్నది తెలియాలి.
అయితే ఈ సినిమా రిలీజ్ వరకూ సుకుమార్..దేవీ శ్రీ ప్రసాద్ చాలా కష్టపడ్డారు. చివరికి ప్రీ రిలీజ్ ఈవెంట్కి సైతం హాజరు కాకుండా సినిమా పనుల్లోనే తలమునకలై ఉన్నారు. అయినప్పటికి లోపాలు కనిపిస్తున్నాయి. సౌండింగ్ విషయంలో మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. మరి ఆ తర్వాత ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుందో చూడాలి.