దుబాయ్ బుర్జ్ ఖ‌లీఫాపై తొలి ట్రైల‌ర్ లాంచ్

Update: 2021-11-11 05:51 GMT
దుల్కార్ స‌ల్మాన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన మలయాళ చిత్రం కురుప్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్ లో జరిగిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని చూడబోయే ప్రతి ఒక్కరికీ ఇది అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నేను చాలా ఖచ్చితంగా అనుకుంటున్నానని దుల్కార్ అన్నారు. కథ - ఆలోచన (సినిమా) యూనివ‌ర్శ‌ల్. అందుకే మేము దీనిని బ‌హుభాషలలో విడుదల చేస్తున్నాము. హైదరాబాద్ కు తిరిగి రావడం నాకు ఎప్పుడూ సంతోషాన్నిస్తుంది. తెలుగు ప్రేక్షకుల కంటే పెద్ద సినిమా ప్రేమికులు లేరని నేను ఎప్పుడూ చెబుతుంటాను. నా మొదటి సినిమా ఉస్తాద్ హోటల్ సమయంలో నేను హైదరాబాద్ కు వ‌చ్చినప్పుడు కొంతమంది అభిమానులు నేను `ఉస్తాద్ హోటల్‌`ని చూశాను అని చెప్పేవారు. యూట్యూబ్ లో చూశామ‌ని నాతో చెప్పేవారు.. అంటూ ఎగ్జ‌యిట్ అయ్యారు. ఇక‌పై తెలుగు చిత్రాల్లో నటిస్తాన‌ని ప్రామిస్ చేశారు.

``నేను హను రాఘవపూడి దర్శకత్వంలో నా రెండవ తెలుగు చిత్రాన్ని పూర్తి చేయబోతున్నాను. దీనిని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. అది కూడా ప్రత్యేకంగా ఉండబోతోంది. సినిమాల్లో మా కురుప్‌ని చూడండి. తెలుగు అనువాదం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. దానికి నేనే డబ్బింగ్ చెప్పాను. స్ట్రెయిట్ తెలుగు సినిమాలా అనిపించాలనుకున్నాం. మీరు దీన్ని ఆనందిస్తారు. నవంబరు 12 కోసం నేను ఊపిరి పీల్చుకుని ఉత్సుకతతో భయాందోళనతో ఎదురు చూస్తున్నాను.. అని అన్నారు. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన `కురుప్` వేఫేరర్ ఫిల్మ్స్ - ఎమ్-స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ల‌లో తెర‌కెక్కింది.

భారతదేశం నుంచి మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ గా.. పరారీలో ఒకరైన సుకుమార కురుప్ లైఫ్ జ‌ర్నీ స్టోరి కురుప్. 1980 లలో భీమా మోసం కారణంగా తాను మ‌ర‌ణించాన‌ని క‌ప‌ట‌నాట‌క‌మాడిన అత‌డు ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. కురుప్ - గ్లోబల్ మహమ్మారి కారణంగా విడుదల ఆలస్యమైంది. ఎట్ట‌కేల‌కు రిలీజ్ కి వ‌స్తోంది.

ఈ చిత్రాన్ని భార‌త‌దేశం స‌హా దుబాయ్ UAE -కెన‌డా స‌హా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో థియేటర్లలో భారీగా విడుదల చేయ‌నున్నారు. ఇక దుబాయ్ బుర్జ్ ఖ‌లీఫా భ‌వంతిపై ట్రైల‌ర్ ఆవిష్క‌రించిన తొలి సౌత్ సినిమా కూడా ఇదే. దీనిపై దుల్కార్ ఆనందం వ్య‌క్తం చేయ‌గా అభిమానులు దానిని వింత‌గా భావించారు. ఇక దుల్కార్ ఈ సినిమా గురించి యుఏఈ మీడియాకి చాలా సంగ‌తులే చెప్పారు. ఈ సినిమా కోసం శ్ర‌మించ‌డ‌మే గాకుండా.. నేను భారీ పెట్టుబడి పెట్టాను అని దుల్కార్ తెలిపారు. నా కెరీర్‌లో ఇదే నా బిగ్గెస్ట్ ప్రొడక్షన్ అని గల్ఫ్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దుల్కర్ అన్నారు. కురుప్ బడ్జెట్ దాదాపు 350 మిలిన్ డాల‌ర్లు . సుమారు 17.2 మిలియన్ దీనార్ ల‌తో ఇది స‌మానం.మలయాళ సినిమాల చలనచిత్ర బడ్జెట్ ప్రమాణాల ప్రకారం ఇది చాలా ఎక్కువ‌. అయితే ‘కురుప్‌’ అనేది మామూలు సినిమా కాదు కాబట్టి దాని చుట్టూ గొప్ప హైప్ క‌నిపిస్తోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. దుల్కర్ సల్మాన్ న‌టిస్తున్న‌ సెల్యూట్- కింగ్ ఆఫ్ కోథా- ఓతిరమ్ కడకం- హే సినామిక రిలీజ్ కి రావాల్సి ఉంది.







Full View
Tags:    

Similar News