ఖిలాడీని వ‌దిలిపెట్ట‌ని దుబాయ్ వీసా అధికారులు?

Update: 2021-07-23 10:30 GMT
బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో ర‌వితేజ కాక మీదున్న సంగ‌తి తెలిసిందే. క్రాక్ విజ‌యంతో వెంట‌వెంట‌నే మైండ్ బ్లాక్ అయ్యే ట్రీట్ ని ప్లాన్ చేసాడు. ప్ర‌స్తుతం క్రేజీగా.. ఖిలాడీ .. రామారావు ఆన్ డ్యూటీ చిత్రాల‌తో అతడు బిజీ బిజీ. తాజా స‌మాచారం మేర‌కు రామారావు .. షెడ్యూల్ ను ముగించిన తరువాత హీరో రవితేజ తన మ‌రో యాక్షన్ థ్రిల్లర్ ఖిలాడి కోసం షూటింగును తిరిగి ప్రారంభించనున్నారు. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ ఆగస్టు మొదటి వారంలో ప్రారంభమవుతుంది. అయితే ఇంత‌లోనే ఊహించ‌ని ట్విస్టు. ర‌వితేజ‌ షూటింగ్ లో ప్రణాళిక స‌డెన్ గా మారింది. ఇది పెద్ద మార్పు .. పైగా ఊహించ‌నిది అని తెలుస్తోంది.

ఖిలాడి బృందం దుబాయ్ లో కీలకమైన షెడ్యూల్ ను ప్లాన్ చేసింది. రవితేజ నటించిన రెండు పాటలు  కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను గల్ఫ్ నగరంలో చిత్రీకరించాల్సి ఉంది. అయినప్పటికీ యుఎఇ అధికారులు ఇప్పటికీ వీసా దరఖాస్తులను అంగీకరించడం లేదు కాబట్టి ఖిలాడి బృందం ఆ ప్లాన్స్ ని విరమించుకుంది. హైదరాబాద్ లోనే పాటలు చిత్రీక‌రించేందుకు భారీ సెట్లను నిర్మిస్తోంది.

అయితే రవితేజ నటించాల్సిన కొన్ని సన్నివేశాలను దుబాయ్ లో ముందే అనుకున్నట్లుగానే చిత్రీకరించనున్నారు. పాత్ర స్వ‌భావం ప‌రంగా రవితేజ ఖిలాడిలోని దుబాయ్ కు చెందిన వాడు.. అందుకే ఇందులో కొన్ని సన్నివేశాలను వేరొక‌ ప్రదేశంలోకి మార్చలేమని చెబుతున్నార‌ట‌. ఈ చిత్రానికి ర‌మేష్ వ‌ర్మ దర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. మీనాక్షి చౌదరి- డింపుల్ హయతి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. కె.ఎల్.యూనివ‌ర్శిటీ అధినేత‌ కోనేరు సత్యనారాయణ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News