డబ్బింగ్ కష్టం అయ్యింది.. షూటింగ్ అవసరమా సామ్‌?

Update: 2022-11-17 10:30 GMT
సమంత మయో సైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఆమె అనారోగ్యం కారణంగా గత కొన్నాళ్లుగా పూర్తిగా షూటింగ్ కు దూరం అయ్యింది. అంతకు ముందే షూటింగ్ పూర్తి అయిన యశోద సినిమా కోసం డాక్టర్ ను పక్కన పెట్టుకుని డబ్బింగ్‌ చెప్పిన విషయం తెల్సిందే.

తమిళం మరియు తెలుగు భాషల్లో సమంత డబ్బింగ్‌ చెప్పింది.. ఆ డబ్బింగ్‌ చెప్పడం కోసం సమంత చాలా కష్టపడిందని.. ఆమె తీవ్రమైన ఒత్తిడికి గురి అవ్వడంతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలు రావడంతో పక్కన ఉన్న డాక్టర్‌ ఆమెకు చికిత్స అందించాడు అంటూ సినిమా ప్రమోషన్ సందర్భంగా నిర్మాతలు చెప్పుకొచ్చారు.

డబ్బింగ్‌ చెప్పడానికే చాలా కష్టపడ్డ సమంత త్వరలో షూటింగ్ కు జాయిన్ అవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి సినిమా యొక్క షూటింగ్‌ కార్యక్రమాలకు సమంత హాజరు అయ్యేందుకు ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి.

సమంత వల్ల ఇప్పటికే చాలా ఆలస్యం అయిన ఖుషి సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో అయినా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే సినిమా షూటింగ్‌ ను పూర్తి చేయడం తన బాధ్యతగా భావించి సమంత ఇంకా పూర్తిగా కోలుకోకుండానే షూటింగ్‌ లో హాజరు అయ్యేందుకు ఓకే చెప్పిందట. డబ్బింగ్ కష్టంగా చెప్పిన సామ్ షూటింగ్ కు వెళ్లడం అవసరమా అన్నట్లుగా కొందరు ప్రశ్నిస్తున్నారు.

సమంత కు ఒక వైపు చికిత్స అందిస్తూనే మరో వైపు షూటింగ్‌ లో పాల్గొనే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఖుషి సినిమా కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో విజయ్ తో పాటు సమంత ఫ్యాన్స్ ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News