కోవిడ్ నేపథ్యంలో మూతబడిపోయిన సినిమా హాళ్లకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్స్ మల్టీప్లెక్సెస్ ఓపెన్ చేసుకోడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఇంకా సినిమాల సందడి మొదలు కాలేదు. ఇప్పటి వరకు ఏ సినిమా ముందుగా రిలీజ్ చేస్తారనేది ప్రకటించలేదు. అక్కడక్కడా కొన్ని మల్టీప్లెక్సెస్ ఓపెన్ చేసినప్పటికీ కొత్త సినిమాల విడుదల లేకపోవడంతో ఓల్డ్ మూవీస్ ని ప్రసారం చేస్తున్నారు. కాకపోతే త్వరలోనే పూర్తి స్థాయిలో థియేటర్స్ తెరవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేసినా మొట్ట మొదటిగా తెలుగులో నిర్మించబడిన సినిమాలకే ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది.
లాక్ డౌన్ కి ముందు తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ మూవీస్ కి కూడా థియేటర్స్ కేటాయించేవారు. కాకపోతే కరోనా రాకతో ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయి. ఇప్పటికే కంప్లీట్ అయిన సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తున్నప్పటికీ.. థియేట్రికల్ రిలీజ్ కోసం చాలా సినిమాలు ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్స్ తెరిచాక మొదటి రెండు నెలలు డబ్బింగ్ సినిమాలకు అవకాశం ఇవ్వకపోవచ్చనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే కనుక జరిగితే 'మాస్టర్' 'చక్ర' వంటి సినిమాల పరిస్థితి ప్రశ్నర్థకంగా మారనుంది. ప్రస్తుతం రిలీజ్ కి రెడీగా ఉన్న డబ్బింగ్ సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. తెలుగులో డైరెక్ట్ రిలీజ్ అయితేనే కమర్షియల్ గా వర్క్ అవుట్ అవుతాయి. మరి తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.