అరవ సినిమాలకే రాసిచ్చేశారా..

Update: 2016-05-10 13:30 GMT
ఐతే అతివృష్టి.. లేకుంటే అనావృష్టి.. ఇలా ఉంటుంది తెలుగు సినిమాల రిలీజ్ వ్యవహారం. ఫిబ్రవరి-మార్చి నెలల్లో అన్ సీజన్లో ఇబ్బడి ముబ్బడిగా సినిమాలొచ్చేశాయి. కానీ ఇప్పుడు సినిమాలకు బెస్ట్ సీజన్ అనదగ్గ సమ్మర్ సీజన్లో సినిమాలు తగ్గిపోతున్నాయి. గత కొన్ని వారాలుగా ప్రతి శుక్రవారం ఒక్కో తెలుగు సినిమా మాత్రమే రిలీజవుతోంది. రాబోయే శుక్రవారం అయితే ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రేసులో లేదు.

ఆ తర్వాతి వారం మహేష్ బాబు సినిమా ‘బ్రహ్మోత్సవం’ విడుదలవుతుండటంతో ఈ వారం బాక్సాఫీస్ బరిలో దిగడానికి ఏ నిర్మాతా సాహసించడంలేదు. నిజానికి సమ్మర్ సీజన్ లో అన్ని వర్గాల ప్రేక్షకులూ థియేటర్లకు వస్తారు. చిన్న-మీడియం రేంజి సినిమాలు మంచి టాక్ తెచ్చుకుని ఓ వారం ఆడినా చాలు. అయినప్పటికీ ఈ వారం ఏ సినిమా కూడా థియేటర్లలోకి రావడం లేదు. కొన్ని సినిమాలు ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్నా సరే.. విడుదలకు ముందుకు రావట్లేదు.

ఐతే ఈ అడ్వాంటేజిని ఉపయోగించుకుని.. తమిళ డబ్బింగ్ సినిమాలు వరుస కట్టేస్తున్నాయి. జి.వి.ప్రకాష్ కుమార్-శ్రీదివ్య కాంబినేషన్లో తెరకెక్కిన ‘పెన్సిల్’ ఒకేసారి తమిళంతో పాటు తెలుగులోనూ ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. విజయ్ ఆంటోనీ హిట్ మూవీ ‘పిచ్చైకారన్’ను ‘బిచ్చగాడు’ పేరుతో ఈ వారమే రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు శివకార్తికేయన్-బిందు మాధవి జంటగా నటించిన పాత సినిమా ‘కేడి బిల్లా.. కిలాడి రంగా’ కూడా ఈ శుక్రవారమే వచ్చేస్తోంది. ఇంకా డబ్బింగ్ సినిమాలే అయిన రహదారి.. స్ట్రాబెర్రీ.. టీనేజ్.. కూడా ఈ వారమే ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాయి.
Tags:    

Similar News