షారుక్ తో న‌న్ను పోల్చి అత‌న్ని అవ‌మానించొద్దు! దుల్కార్ స‌ల్మాన్

Update: 2022-09-18 01:30 GMT
మాల‌యాళం స్టార్ హీరో దుల్కార్ సల్మాన్ వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. మాలీవుడ్ స‌హా టాలీవుడ్ లోనూ క్రేజీ స్టార్ గా వెలిగిపోతున్నాడు. ఇటీవ‌లే 'సీతారామం' తో క్లాసిక్ హిట్ అందుకుని తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. ఒకే 'బంగారం' త‌ర్వాత యంగ్ హీరో టాలీవుడ్ లో అందుకున్న అతి పెద్ద స‌క్సెస్ ఇది.

దీంతో అత‌ని మార్కెట్ మ‌రింత మెరుగుప‌డింది. తెలుగులోనే స్ర్టెయిట్ సినిమా అవకాశాలు దుల్కార్ కి వ‌రిస్తున్నాయి. అలాగే బాలీవుడ్ లోనూ యంగ్ హీరో స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఇప్ప‌టికే 'ది జోయా ఫ్యాక్ట‌ర్' సినిమాతో లాంచ్ అయిన దుల్కార్ ప్ర‌స్తుతం 'ది రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్' చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇంకా కొత్త అవ‌కాశాలు క్యూలో ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో తాజా స‌క్సెస్ లు స‌హా యంగ్ హీరో వేగం చూసి నెటి జ‌నులు స‌హా అభిమానులు ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తోనే పోల్చారు. 'సీతారామం'లో దుల్కార్ న‌ట‌న చూసి షారుక్ ఖాన్ వీర్ జురాతో పొల్చుతున్నారు.

దీంతో దుల్కార్ ఒక్క‌సారిగా షాక్ అయ్యారు.  ఈసంద‌ర్భంగా యంగ్ హీరో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

"షారుక్ ఖాన్ తో న‌న్ను పోల్చ‌డం అన్న‌ది షారుక్ ని అవ‌మానించిన‌ట్లే. నేను షారుక్ స‌ర్ సినిమాలు చూస్తూ పెరిగాను. అత‌నే నాకు స్పూర్తి. షారుక్ ని చూసి న‌ట‌న‌లో  ఎన్నో మెళ‌కువలు తెల‌సుకున్నాను. కెరీర్ ఆరంభంలో సందేహాలు వ‌చ్చిన‌ప్ప‌డు షారుక్ వైపే చేసేవాడిని. షారుక్ అనే వ్య‌క్తి ఒక్క‌రే.  అలాంటి గొప్ప న‌టుడితో న‌న్ను పోల్చ‌డం న‌చ్చ‌లేదు' అని అన్నారు.

దుల్కార్ వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి యంగ్ హీరో షారుక్ ని ఎంత‌గా అభిమానిస్తారు? అన్న‌ది అద్దం ప‌డుతుంది. ఓ స్టార్ హీరో గురించి మ‌రో స్టార్ ఇంత నిరాడంబ‌ర‌త‌గా స్పందించ‌డం విశేషం. ప్ర‌స్తుతం  దుల్కర్ సల్మాన్  'చుప్‌'లో న‌టిస్తున్నారు. ఈ సినిమా  సెప్టెంబర్ 23న విడుదల కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News