నా తండ్రిని చంపుతామంటున్నారు: స్టార్ హీరో

Update: 2020-04-27 14:03 GMT
ప్రముఖ మలయాళ హీరో తెలుగులో కూడా నటించిన ‘దుల్కర్ సల్మాన్’ చిక్కుల్లో పడ్డారు. ఆయన నటించిన మలయాళ చిత్రం ‘వారానే అవశ్యముంద్’ వివాదాల్లో చిక్కుకుంది.  ఈ చిత్రంలోని ఓ కామెడీ సీన్ తమిళ ప్రజలను కించపరిచే విధంగా ఉందట. ఈ సీన్   పట్టణ ప్రవేశంలోని ఓ కామెడీ సీన్ అని.. దానిపై ఎన్నో మీమ్స్ ఉంటాయని దుల్కర్ వివరణ ఇచ్చినా వేడి చల్లారడం లేదు. దీంతో తమిళులంతా ఇప్పుడు దుల్కర్ సల్మాన్ పై పడ్డారు.

దుల్కర్ సల్మాన్ ను తీవ్రంగా సోషల్ మీడియాలో దూషిస్తున్నారు. అంతేకాదు ఈయన తండ్రి ప్రముఖ అగ్ర హీరో మమ్ముట్టిని కూడా తీవ్రంగా తిట్టిపోస్తున్నారు. తండ్రి కొడుకులను వారి మతాన్ని బేస్ చేసుకొని ట్రోల్ చేస్తున్నారు తమిళిలు.. దుల్కర్ ను, దుల్కర్ తండ్రి  మమ్ముట్టిని చంపుతామని బెదిరిస్తున్నారట.. ఇక సీనియర్ నటులపై కూడా దుమ్మెత్తి పోస్తున్నారు.

ఇక దీనిపై దుల్కర్ సల్మాన్ ట్విట్టర్ లో క్షమాపణలు చెప్పారు. ఏదీ కావాలని చేయలేదని.. ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండని కోరాడు. ఇకపై దూషించడం.. తన తండ్రిని చంపుతామని బెదిరించడం.. బాధపట్టేలా కామెంట్స్ చేయవద్దని కోరాడు. తండ్రులను, సీనియర్ నటులను దూషించడం తప్పు అని దుల్కర్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

    
    
    

Tags:    

Similar News